“ఎఫ్ 3” చిత్ర యూనిట్ ను అప్రిషియేట్ చేసిన బ్రహ్మానందం!

Published on Jun 1, 2022 8:00 pm IST

ఔట్ అండ్ ఔట్ ఫన్ ఎంటర్ టైనర్ గా అనిల్ రావిపూడి దర్శకత్వం లో తెరకెక్కిన చిత్రం ఎఫ్3. ఈ చిత్రంలో వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా భాటియా, మెహ్రిన్, సోనాల్ చౌహాన్ లు ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం థియేటర్ల లో విడుదల అయ్యి బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతోంది. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రం ను తాజాగా హాస్య బ్రహ్మ బ్రహ్మానందం చూశారు.

ఈ మేరకు చిత్ర యూనిట్ ను అప్రిషియే ట్ చేయడం జరిగింది. అంతేకాక కోర్ టీమ్ తో ఒక ఇంటర్వ్యూ కూడా చేయడం జరిగింది. తాజాగా అందుకు సంబంధించిన ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. ఈ ఫోటో లో వెంకటేష్, వరుణ్ తేజ్, దర్శకుడు అనిల్ రావిపూడి, బ్రహ్మానందంతో అలీ హ్యాపీగా కనిపిస్తున్నారు.

సంబంధిత సమాచారం :