నాన్నగారి ఆరోగ్యం మెరుగ్గా ఉంది – హీరో గౌతమ్

Published on Jan 17, 2019 2:55 pm IST

ప్రఖ్యాత తెలుగు హాస్య నటుడు పద్మశ్రీ, డా: బ్రహ్మానందం ఆస్పత్రిలో ఉన్నారనే విషయం తెలిసి ఆయన అభిమానులు, సన్నిహితులు కలవరపడ్డారు. అయితే ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని ఆయన తనయుడు హీరో గౌతమ్ తెలిపారు. కొన్ని నెలలుగా ఛాతిలో అసౌకర్యంగా అనిపించడంతో దేశంలోనే అత్యుత్తమమైన ముంబైలోని ‘ఏషియన్ హార్ట్ ఇన్స్టిట్యూట్ ‘లో సోమవారం నాడు గుండె ఆపరేషన్‌ చేయించుకున్నారు.

కాగా ప్రముఖ హృదయ చికిత్స నిపుణులు శ్రీ రమాకాంత్ పాండా బ్రహ్మానందం గారికి శస్త్ర చికిత్స చేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉంది. ఐసీయు నుంచి సాధారణ గదికి మార్చటం జరిగింది అని రాజా గౌతమ్ తెలిపారు. బ్రహ్మానందం కుమారులు రాజా గౌతమ్, సిద్దార్థ్‌లు తండ్రితో పాటు ముంబైలోనే ఉన్నారు.

సంబంధిత సమాచారం :

X
More