టాక్..”భీమ్లా నాయక్” లో బ్రహ్మానందం రోల్ ఇదేనా.?

Published on Jan 13, 2022 7:02 pm IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు రానా దగ్గుబాటిలు హీరోలుగా నిత్యా మీనన్, అలాగే సంయుక్త మీనన్ లు హీరోయిన్ లుగా నటిస్తున్న లేటెస్ట్ అండ్ మోస్ట్ అవైటెడ్ మాస్ ప్రాజెక్ట్ “భీమ్లా నాయక్”. దర్శకుడు సాగర్ కె చంద్ర తెరకెక్కిస్తున్న ఈ సినిమా పై ఎన్నో అంచనాలు కూడా నెలకొన్నాయి.

మరి ఇదిలా ఉండగా ఈ సినిమా కూడా షూటింగ్ ఆల్ మోస్ట్ కంప్లీట్ అవ్వవచ్చింది. అయితే ఈ సినిమా క్యాస్టింగ్ పరంగా మేకర్స్ పలు జాగ్రత్తలు తీసుకున్న సంగతి తెలిసిందే. ఆసక్తికర నటులనే సినిమాలో పెట్టి మంచి బజ్ ని ఈ సినిమాపై తెప్పించారు. అలా ఈ సినిమాలో లెజెండరీ నటులు సీనియర్ కమెడియన్ బ్రహ్మానందం కూడా నటిస్తున్నారు.

ఈ విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ ఆయన ఏ పాత్రలో కనిపిస్తారు అనే దానిపై గత నుంచి ఒక టాక్ వినిపిస్తుంది. ఈ లేటెస్ట్ టాక్ ప్రకారం బ్రహ్మానందం ఒక ఫారెస్ట్ ఆఫీసర్ గా కనిపిస్తారని తెలుస్తుంది. మరి ఇది ఎంత వరకు నిజమో కాలమే నిర్ణయించాలి.. ఇక ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తుండగా సితార ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :