బ్రహ్మానందం పాత్ర సాదాసీదాగా ఉండదట

Published on Jan 23, 2020 10:24 am IST

కృష్ణవంశీ ప్రస్తుతం ‘రంగమార్తాండ’ సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా కోసం స్టార్ నటీనటుల్ని ఎంపిక చేసుకున్నారు కృష్ణవంశీ. వారిలో సీనియర్ నటుడు బ్రహ్మానందం కూడా ఒకరు. బ్రహ్మానందం అనగానే ఏదో కామెడీ క్యారెక్టర్ కాదు సీరియస్ రోల్. ముందునుండి చెబుతున్నట్టు ఆయన పాత్రలో బలమైన భావోద్వేగాలు ఉంటాయట.

ఉదాహరణకు బ్రహ్మానందం చేసిన ఏమోషనల్ పాత్రల్లో ‘బాబాయ్ హోటల్’ సినిమాలోని బాబాయ్ పాత్ర ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అలాంటి స్థాయిలోనే ‘రంగమార్తాండ’ సినిమాలో పాత్ర కూడా ఉంటుందట. ఈ చిత్రాన్ని మధు కలిపు, అభిషేక్ జవ్కర్ కలిసి నిర్మిస్తున్నారు. మరాఠీ చిత్రం ‘నటసామ్రాట్’కు ఇది రీమేక్. ఈ చిత్రానికి మాస్ట్రో ఇళయరాజా సంగీతం అందించనున్నారు. ఇందులో ప్రధాన పాత్రదారులుగా రమ్యకృష్ణ, ప్రకాష రాజ్ నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

X
More