‘ఎర్రబస్సు’లో రామనాథ చౌదరిగా బ్రహ్మానందం..!

‘ఎర్రబస్సు’లో రామనాథ చౌదరిగా బ్రహ్మానందం..!

Published on Oct 11, 2014 12:58 PM IST

brahmanandam
దర్శకరత్న దాసరి నారాయణరావు స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘ఎర్రబస్సు’. తమిళంలో ఘన విజయం సాధించిన ‘మంజా పై’ సినిమాకు తెలుగు రీమేక్ ఇది. దాసరి, మంచు విష్ణు తాతా మనవళ్లుగా నటిస్తున్నారు. కేథరిన్‌ త్రేసా హీరోయిన్. ఈ సినిమా కోసం ఇటివలే కామెడీ కింగ్ బ్రహ్మానందంపై స్పెషల్ కామెడీ ట్రాక్ చిత్రీకరించారు. ఈ సన్నివేశాలలో దాసరి, బ్రహ్మానందం, ఎమ్మెస్‌ నారాయణ, హేమ నటించారు.
‘ఎర్రబస్సు’లో రామనాథ చౌదరిగా బ్రాహ్మి కనిపిస్తారు. ఒకానొక సందర్భంలో రామనాథ చౌదరి కాకులను బాగా తిట్టేశాడు. అది విన్న ఒక కాకి, తమ జాతికి చౌదరి గురించి చెప్పింది. అంతే, కాకులన్ని చౌదరి ఇంటిని చుట్టుముట్టాయి. అతనిపై పగబట్టాయి. కాకుల పగ నుండి ఎలా తప్పించుకున్నాడు అనేది ప్రేక్షకులు సినిమా చూసి తెలుసుకోవాలి.
ఈ సినిమాను నవంబర్ 14న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. అక్టోబర్ చివరి వారంలో ఆడియో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. చక్రి సంగీతం అందించారు.

తాజా వార్తలు