దాదాపు 8 ఏళ్ళ తర్వాత మళ్ళీ మెగాస్టార్ ని ఓ 4 నిమిషాల పాటు సిల్వర్ స్క్రీన్ పై కనిపించేలా చేసిన సినిమా ‘బ్రూస్ లీ’. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన ఈ బ్రూస్ లీ సినిమా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్ తో రన్ అవుతున్న ఈ సినిమాకి బాక్స్ ఆఫీసు వద్ద కలెక్షన్స్ కూడా చాలా బాగున్నాయి. ఒక్క ఆంధ్ర, తెలంగాణాలోనే కాకుండా గ్రాండ్ గా రిలీజ్ చేసిన ఓవర్సీస్ లో కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది.
యుఎస్ ట్రేడ్ రిపోర్ట్స్ చెప్పిన సమాచారం ప్రకారం బ్రూస్ లీ ప్రీమియర్ షో తో కలుపుకొని మొదటి రెండు రోజుల్లోనే హాఫ్ మిలియన్ మార్క్ ని క్రాస్ చేసింది. రామ్ చరణ్ కెరీర్లో ప్రీమియర్స్ లోనే అత్యధిక వసూళ్లు సాధించిన ఈ సినిమా ఓవరాల్ గా 1 మిలియన్ మార్క్ టచ్ అవుతుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. శ్రీను వైట్ల దర్శకత్వంవహించిన ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించింది. మొదటి రెండు రోజుల్లో యుఎస్ కలెక్షన్స్ రిపోర్ట్ ని మీకందిస్తున్నాం..
| వారం | కలెక్షన్స్(డాలర్స్) |
| గురువారం ప్రీమియర్స్ | $285,176K |
| శుక్రవారం | $154,020K |
| శనివారం | $123,015K |
| మొత్తం | $562,211K |
$154k on Friday taking 1st day total to $439,050 (Fri+premieres)


