పెళ్లయ్యాక కూడా కాజల్ కి బంపర్ ఆఫర్సే !

పెళ్లయ్యాక కూడా కాజల్ కి బంపర్ ఆఫర్సే !

Published on Jan 4, 2021 12:12 PM IST

Kajal Aggarwal

స్టార్ హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ కి ఇప్పటికీ మంచి డిమాండ్ ఉంది. అయితే చాలా కాలంగా వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లు‌తో ప్రేమాయణం సాగించిన కాజల్.. మొత్తానికి 2020 అక్టోబర్ 30న అతడిని వివాహం చేసుకుంది. పెళ్లి అయ్యాక ఇక హీరోయిన్లకు పెద్దగా అవకాశాలు రావు. కానీ కాజల్ కు మాత్రం వరుస అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం కాజల్ అగర్వాల్ చేతిలో ఇప్పటికే ‘ముంబై సాగా, ఇండియన్ 2’, ‘ఆచార్య’ సినిమాలు ఉన్నాయి.

పైగా ఇలయదళపతి విజయ్ – మురుగదాస్ దర్శకత్వంలో ‘తుపాకి 2’లో కూడా కాజల్ నే కథానాయిక. ఇలా మొత్తం నాలుగు పెద్ద ప్రాజెక్ట్స్ చేస్తున్న ఆమె చేతికి మరో భారీ చిత్రం తమిళ్ స్టార్ హీరో సూర్య, మాస్ డైరెక్టర్ హరి కాంబినేషన్ లో రాబోతున్న సినిమా కూడా వెళ్ళింది. అలాగే విక్రమ్ సినిమాలో కూడా కాజల్ నే హీరోయిన్ గా తీసుకోబోతున్నారట. విజయ్, సూర్య, విక్రమ్ సినిమాల కోసం తమిళ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇలాంటి సినిమాల్లో కాజల్ హీరోయిన్ అంటే. కచ్చితంగా కాజల్ కి ఇవి బంపర్ ఆఫర్లే .

సంబంధిత సమాచారం

తాజా వార్తలు