యూవీ క్రియేషన్స్‌ను పొగడ్తల్లో ముంచెత్తిన బన్నీ!

యూవీ క్రియేషన్స్‌ను పొగడ్తల్లో ముంచెత్తిన బన్నీ!

Published on Aug 17, 2015 11:50 PM IST

allu-arjun2
‘మిర్చి’, ‘రన్ రాజా రన్’, ‘జిల్’ ఇలా మూడు సినిమాలతోనే తెలుగులో ఓ మంచి గుర్తింపు తెచ్చుకున్న నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్. ఈ మూడు సినిమాలతో యూవీ క్రియేషన్స్ తెలుగు పరిశ్రమకు కొత్త దర్శకులను పరిచయం చేయడంతో పాటు ఫ్రెష్ సినిమాలను రుచి చూపింది. దీంతో ఈ ప్రొడక్షన్ హౌస్ నుంచి సినిమా వస్తుందనగానే ఒక ఆసక్తి కలగడం మొదలైంది. ప్రస్తుతం శర్వానంద్‌తో ఓ సినిమా, నానితో భలే భలే మగాడివోయ్ సినిమాలు చేస్తోన్న యూవీ క్రియేషన్స్, బాహుబలి తర్వాత ప్రభాస్ చేయబోయే సినిమాకు కూడా సిద్ధమవుతోంది.

ఇక నాని హీరోగా రూపొందుతోన్న భలే భలే మగాడివోయ్ సినిమాను యూవీ క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ 2 బ్యానర్‌పై రూపొందించిన విషయం తెలిసిందే. మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు సంబంధించిన ఆడియో ఈమధ్యే విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇక ఆడియో రిలీజ్‌కు ముఖ్య అతిథిగా హాజరైన అల్లు అర్జున్ మాట్లాడుతూ.. సినిమా మంచి విజయం సాధించాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన యూవీ క్రియేషన్స్ సంస్థ ఈ మధ్య కాలంలో తనకు బాగా నచ్చిన ప్రొడక్షన్ హౌస్ అని, వాళ్ళు ఎంచుకుంటున్న కథలు, కొత్తతరాన్ని ఎంకరేజ్ చేస్తున్న విధానం నచ్చిందని అల్లు అర్జున్ తెలిపారు. త్వరలోనే యూవీ క్రియేషన్స్‌ నిర్మాణంలో ఓ సినిమా చేయాలనుందని ఆయన తెలిపారు.

తాజా వార్తలు