బెంగుళూరులో ఎంజాయ్ చేస్తున్న బన్ని

బెంగుళూరులో ఎంజాయ్ చేస్తున్న బన్ని

Published on May 20, 2015 4:30 PM IST

Allu-arjn

‘S/O సత్యమూర్తి’తో సమ్మర్ హిట్ అందుకున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం హాలిడేలో ఉన్నాడు. హైదరాబాద్ వేడి నుంచి దూరంగా చల్లని ప్రదేశమైన బెంగుళూరులో అల్లు అర్జున్ తన ఫ్యామిలీతో కలిసి విలువైన సమయాన్ని గడుపుతూ తన కుమారుడు అయాన్ తో ఎంజాయ్ చేస్తున్నాడు. మే మొదటి వారంలో లండన్ వెళ్లి అక్కడ కొద్ది రోజులు సమ్మర్ వెకేషన్ ని ఎంజాయ్ చేసిన అల్లు అర్జున్ ఫ్యామిలీ ప్రస్తుతం బెంగుళూరులో రిలాక్స్ అవుతున్నారు. కొద్ది రోజుల క్రితం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా శ్రీను వైట్ల సినిమా మొదలు కాకముందు బెంగుళూరు లోనే తన ఫ్యామిలీ కలిసి వెకేషన్ ని ఎంజాయ్ చేసాడు.

అల్లు అర్జున్ ఈ బెంగుళూరు ట్రిప్ తర్వాత హైదరబాద్ కి తిరిగి వచ్చి బోయపాటి శ్రీనుతో చేయనున్న సినిమాని మొదలు పెట్టనున్నాడు. జూన్ మొదట్లో ఈ సినిమా అధికారికంగా ప్రారంభం కానుంది. తన మార్క్ యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటూనే పూర్తి రొమాంటిక్ ఎంటర్టైనర్ గా బోయపాటి శ్రీను కథని సిద్దం చేసినట్లు సమాచారం. ప్రస్తుతం అల్లు అర్జున్ కోసం హీరోయిన్స్ అన్వేషణ జరుగుతోంది. అల్లు అర్జున్ హోం బ్యానర్ అయిన గీత ఆర్ట్స్ బ్యానర్ లో ఈ సినిమా రూపొందనుంది. ఇది కాకుండా అల్లు అర్జున్ గోనగన్నా రెడ్డిగా కనిపించనున్న ‘రుద్రమదేవి’ సినిమా విడుదలకు సిద్దమవుతోంది.

తాజా వార్తలు