యూఎస్ నాన్ బాహుబలి బన్నీ అయ్యేలా ఉన్నాడు.

Published on Jan 21, 2020 8:43 am IST

అల వైకుంఠపురంలో చిత్రం యూఎస్ లో విశేష ఆదరణ దక్కించుకుంటుంది. తెలుగు రాష్ట్రాలకు మించిన ఆదరణ అల వైకుంఠపురంలో చిత్రానికి అక్కడ వస్తుంది. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం $3 మిలియన్ మార్కుని దాటివేసింది. ఫుల్ రన్ లో ఈ మూవీ నాన్ బాహుబలి రికార్డ్ సొంతం చేసుకోవడం ఖాయంగా కనిపిస్తుంది. రామ్ చరణ్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన రంగస్థలం $3.5 మిలియన్ వసూళ్లతో నాన్ బాహుబలి రికార్డ్ సొంతం చేసుకున్న చిత్రంగా ఉంది. కొద్దిరోజులలో అల వైకుంఠపురంలో ఈ మార్క్ ని దాటివేసే సూచనలు కనిపిస్తున్నాయి.

బన్నీ త్రివిక్రమ్ ల హ్యాట్రిక్ మూవీగా వచ్చిన అల వైకుంఠపురంలో చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ మరియు గీతా ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించాయి. పూజ హెగ్డే బన్నీకి జంటగా నటించగా థమన్ సంగీతం అందించారు. టబు, సుశాంత్, నివేదా పేతురాజ్, జయరామ్, రాజేంద్ర ప్రసాద్, సముద్ర ఖని, మురళి శర్మ కీలక పాత్రలు చేశారు.

సంబంధిత సమాచారం :

X
More