ఫ్యామిలీ సాంగ్ కి స్టెప్పులేస్తున్న అల్లు అర్జున్

ఫ్యామిలీ సాంగ్ కి స్టెప్పులేస్తున్న అల్లు అర్జున్

Published on Oct 20, 2015 11:14 AM IST

allu-arjun
ఈ ఏడాది ‘S/O సత్యమూర్తి’ అంటూ ఓ క్లాస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో ప్రేక్షకులను మెప్పించిన స్టైలిష్ స్టార్ ప్రస్తుతం బోయపాటి శ్రీను డైరెక్షన్ లో ఓ పర్ఫెక్ట్ మాస్ మసాల ఎంటర్టైనర్ చేస్తున్నాడు. ఈ సినిమాకి ‘సరైనోడు’ అనే టైటిల్ ని పరిశీలిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం అల్లు అర్జున్ పై ఓ యాక్షన్ ఎపిసోడ్ ని షూట్ చేసిన ఈ చిత్ర టీం ప్రస్తుతం సాంగ్ ని షూట్ చేసే మూడ్ లోకి వెళ్ళిపోయింది. తన ఇంట్లో జరిగే ఓ శుభకార్యంలో అల్లు అర్జున్ తన హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ మరియు కుటుంబ సభ్యులతో కలిసి స్టెప్పులేసె ఓ ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ సాంగ్ ని షూట్ చేస్తున్నారు.

ఈ ఫ్యామిలీ సాంగ్ ని రామోజీ ఫిల్మ్ సిటీలోని ఎంసిటీ బిల్డింగ్ లో వేసిన ఓ హౌస్ సెట్లో షూట్ చేస్తున్నారు. ఈ పాటలో అల్లు అర్జున్ తో పాటు రకుల్ ప్రీత్ సింగ్, శ్రీకాంత్, సాయి కుమార్ లు కూడా స్టెప్పులేస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ మునుపెన్నడూ కనిపించని ఓ డిఫరెంట్ పాత్రలో కనిపించనున్నాడు. రెండవ హీరోయిన్ గా కనిపించనున్న కేథరిన్ ట్రేస ఈ సినిమాలో ఎమ్మెల్యేగా కనిపించనుంది. గీత ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మిస్తున్న ఈ సినిమాలో ఆది పినిశెట్టి, ఆదర్శ్ బాలకృష్ణలు నెగటివ్ రోల్స్ లో కనిపించనున్నారు. ఎస్ఎస్ తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు