బన్నీ రియల్ సక్సెస్..హిందీలో “పుష్ప” కి మరింత ఆదరణ అట.!

Published on Dec 28, 2021 8:00 am IST


ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన లేటెస్ట్ భారీ సినిమా “పుష్ప ది రైజ్” కోసం అందరికీ తెలిసిందే. తన మరో హ్యాట్రిక్ దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన ఈ భారీ బడ్జెట్ సినిమా పాన్ ఇండియన్ లెవెల్లో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ టాక్ ని తెచ్చుకుంది. అయితే ఈ సినిమాతో అల్లు అర్జున్ బాలీవుడ్ ఎంట్రీ కోసం కూడా అనేక మంది ఆసక్తిగా ఎదురు చూడగా బన్నీ మాత్రం తనకి ఉన్న క్రేజ్ ఒక్క స్మార్ట్ ఫోన్ టెలివిజన్ వరకే కాదు సిల్వర్ స్క్రీన్ పై కూడా సాలిడ్ గా ఉందని నిరూపించాడు.

ఐకాన్ స్టార్ నటించిన ఈ సినిమా మొదటి వారం నుంచి కూడా ఒకే లాంటి వసూళ్లను కొల్లగొడుతుండడమే కాకుండా అక్క పలు బాలీవుడ్ సినిమాలకు ధీటుగా నిలిచి మంచి ఆదరణ అందుకుంటుంది. అలానే ఇంకో ఆసక్తికర విషయం ఏమిటంటే ఈ సినిమాకి ఇప్పుడు మరిన్ని స్క్రీన్స్ ని యాడ్ చేస్తున్నారట. ఇది నిజంగా ఓ టాలీవుడ్ హీరోకి అందులోని ఇది వరకు ఎలాంటి పాన్ ఇండియా దర్శకునితో కూడా చెయ్యకుండా ఇంత ఆదరణ అందుకోవడం బన్నీ కి చెల్లింది అని చెప్పాలి.

అలా ఓ రకంగా ఇది తనకి రియల్ సక్సెస్ అనే చెప్పాలి. సరైన ప్రమోషన్స్ లేకుండానే ఐకాన్ స్టార్ అక్కడ థియేటర్స్ బాగానే ప్రేక్షకులని రాబడుతున్నాడు. మరిన్ని జాగ్రత్తలు తీసుకొని “పుష్ప 2” ని బాలీవుడ్ లో ప్రెజెంట్ చేస్తే కనుక మ్యాజికల్ ఫిగర్స్ నే చూస్తాం అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

సంబంధిత సమాచారం :