కాకినాడలో కేకపుట్టించిన బన్నీ ఫ్యాన్స్.

Published on Jul 31, 2019 10:55 pm IST

అల్లు అర్జున్ నేడు కాకినాడలో సందడి చేశారు. ఈ సందర్భంగా అక్కడ ఆయనకు ఘనస్వాగతం లభించింది. బన్నీ ఫ్యాన్స్ ఆయన రాక కోసం రాష్ట్రవ్యాప్తంగా అభిమానులను సమీకరించి భారీ ర్యాలీ నిర్వహించారు. అల్లు అర్జున్ పేరుతో గల జెండాలను ప్రదర్శిస్తూ, బన్నీ స్లొగన్స్ తో హోరెత్తించారు.బన్నీ కారులో నుండి అభిమానులకు అభివాదం చేశారు. గత రెండు రోజులుగా బన్నీ ఫ్యాన్స్ సోషల్ మాధ్యమాలలో అల్లుఅర్జున్ ఆర్మీ కాకినాడ యాష్ ట్యాగ్ తో విపరీతంగా ప్రచారం చేశారు. ఇప్పుడు ఆ ర్యాలీ కి సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
కాగా ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో బన్నీ చేస్తున్న చిత్రం షూటింగ్ కాకినాడ లో జరగనుంది. ఈ చిత్రంలో బన్నీ సరసన పూజా హెగ్డే నటిస్తుండగా టబు, సుశాంత్,నివేదా పేతురాజ్,నవదీప్ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. హారిక అండ్ హాసిని ప్రొడక్షన్స్, గీతా ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. థమన్ సంగీతం అందిస్తుండగా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.

సంబంధిత సమాచారం :