దాసరి కామెంట్స్ పై క్లారిటీ ఇచ్చిన బన్ని

దాసరి కామెంట్స్ పై క్లారిటీ ఇచ్చిన బన్ని

Published on Oct 13, 2015 9:52 AM IST

allu-arjun1

మొట్ట మొదటి ఇండియన్ హిస్టారికల్ ఫిల్మ్ గా తెరకెక్కి, గత శుక్రవారం విడుదలయ్యి తెలుగు ప్రేక్షకులను థియేటర్స్ కి రప్పించుకుంటున్న సినిమా ‘రుద్రమదేవి’. అనుష్క, అల్లు అర్జున్, రానా కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా ఊహించనదాని కంటే ఎక్కువగా కలెక్షన్స్ సాధిస్తోంది. నిన్న ఈ సినిమా చూసిన దాసరి నారాయణరావు చూసి ఈ సినిమాపై ప్రశంశల జల్లు కురిపించడమే కాకుండా, ఈ వారం రిలీజ్ కానున్న బిగ్ బడ్జెట్ మూవీని వాయిదా వేయాలని అలా చేస్తేనే మంచి సినిమాలను బతికించిన వాళ్ళం అవుతామని కామెంట్స్ చేసారు.

ఈ విషయంపై రుద్రమదేవిలో గోనగన్నారెడ్డిగా కనిపించిన అల్లు అర్జున్ క్లారిటీ ఇచ్చారు. ‘రుద్రమదేవి సినిమాకి బాక్స్ ఆఫీసు వద్ద సమయం ఇవ్వలేదని బ్రూస్ లీ నిర్మాతలని నిందించడం ఏ మాత్రం సమంజసం కాదు. ఎందుకంటే వారు సినిమా మొదలెట్టినప్పుడే దసరా కానుకగా అక్టోబర్ 16న రిలీజ్ చేస్తామని తెలిపారు. దానికోసం ఓవర్ టైం వర్క్ చేసి సినిమాని ఫినిష్ చేసారు. అలాగే రుద్రమదేవి సెప్టెంబర్ 4న రిలీజ్ కానీ అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది. బ్రూస్ లీ సినిమా రిలీజ్ డేట్ రుద్రమదేవి నిర్మాతకి తెలిసి కూడా రిలీజ్ చేసారు. ఆయన ఈ సీజన్ లో రెండూ ఆడుతాయని రిలీజ్ చేసారు. ఈ రెండు సినిమాలు దసరా సీజన్ లో బాగా ఆడాలని కోరుకుంటున్నాని’ అల్లు అర్జున్ సోషల్ మీడియాలో స్పందించాడు.

ప్రస్తుతం బాక్స్ ఆఫీసు దగ్గర మంచి కలెక్షన్స్ రాబట్టుకుంటున్న రుద్రమదేవి సినిమాకి బ్రూస్ లీ రిలీజ్ కొద్ది వరకూ ఎఫెక్ట్ ఉండచ్చు కానీ పూర్తి స్థాయిలో అయితే ఇబ్బంది ఉండదు.

తాజా వార్తలు