బన్నీ – సుకుమార్ మూవీ అప్డేట్ !

Published on May 4, 2019 2:26 pm IST

గత ఏడాది రంగస్ధలం తో ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన స్టార్ డైరెక్టర్ సుకుమార్ మళ్ళీ ఏడాది తరువాత మెగా ఫోన్ పట్టనున్నాడు. రంగస్థలం తరువాత మహేష్ బాబు తో సినిమా చేయాలని ప్రయ్నతించిన సుకుమార్ అది సక్సెస్ కాకపోవడంతో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కు కథ చెప్పి ఒప్పించాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ స్టేజి లో వున్నా ఈ చిత్రం ఈనెల 11న లాంచ్ కానుందని సమాచారం.

కాగా బన్నీ, సుకుమార్ డైరెక్షన్ లో నటించనుండడం ఇది మూడవ సారి. ఇంతకుముందు వీరి కాంబినేషన్ లో ఆర్య ,ఆర్య 2 చిత్రాలు తెరకెక్కాయి. ఇక ప్రస్తుతం బన్నీ త్రివిక్రమ్ తో సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని తొందరగా పూర్తి చేసి సుకుమార్ తో సినిమా చేయనున్నాడు.

సంబంధిత సమాచారం :

More