మొన్న ఎన్టీఆర్, నిన్న రామ్ చరణ్ నేడు అల్లు అర్జున్ !
Published on Jul 23, 2017 3:55 pm IST


దర్శకుడు సుకుమార్ నిర్మాతగా రూపుదిద్దుకున్న సినిమా ‘దర్శకుడు’. అన్ని పనులు పూర్తి చేసుకుని వచ్చే నెల 4వ తేదీన రిలీజ్ కానున్న ఈ చిత్రాన్ని ఎఫెక్టివ్ గా ప్రమోట్ చేస్తున్నారు సుకుమార్. అందుకోసమే తనతో పని చేసిన, సన్నిహితులైన స్టార్ హీరో హీరోయిన్లను ప్రమోషనల్లో భాగాం చేస్తూ కావలసిన అటెంక్షన్ ను సంపాదించుకుంటున్నారు.

మొదటలో ఈ చిత్ర టీజర్ ను యంగ్ టైగర్ ఎన్టీఆర్ విడుదల చేయగా ఆడియోను మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ చేతుల మీదుగా ఆవిష్కరింపజేశారు. ఇక ప్రీ రిలీజ్ వేడుకకు అల్లు అర్జున్ ముఖ్య అతిధిగా హాజరుకానున్నారు. ఈ వేడుక ఈ నెల 29న జరగనుంది. ఇంతకుముందు కూడా ఈ సినిమా యొక్క పాటల్ని సమంత, రకుల్ ప్రీత్ సింగ్ వంటి స్టార్ హీరోయిన్ల చేత లాంచ్ చేయించారు సుకుమార్. జక్కా హరిప్రసాద్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో సుకుమార్ బంధువు అశోక్ కథానాయకుడి పాత్ర పోషిస్తుండగా ఈషా రెబ్బ, పూజిత పొన్నాడ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

 
Like us on Facebook