డైమండ్ ‘బుర్రకథ’కి ఫుల్ డిమాండ్ !

Published on May 27, 2019 11:00 pm IST

హిట్స్ ప్లాప్ల్స్ తో సంబంధం లేకుండా సాయికుమార్ ఆది వరుసగా సినిమాలను చేసుకుంటూ సరైన బ్రేక్ కోసం ముమ్మరంగా తన వంతు ప్రయత్నం తను చేస్తున్నాడు. కాగా తాజాగా రచయిత డైమండ్ రత్నబాబు దర్శకత్వంలో రెండు మెద‌ళ్ల‌తో పుట్టిన హీరో ఎలాంటి ప‌రిస్థితుల‌ను ఎదుర్కొన్నాడ‌నే కాన్సెప్ట్‌ తో రూపొందుతున్న ‘బుర్రకథ’ చిత్రంలో ఆది హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే.

రీసెంట్‌ గా విడుద‌లైన ఈ సినిమా టీజ‌ర్‌ కు మాస్ ప్రేక్షకుల్లో మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. కాగా ఈ సినిమా వ‌ర‌ల్డ్ వైడ్ థియేట్రిక‌ల్ రైట్స్‌ ను వింటేజ్ క్రియేష‌న్స్ ఫ్యాన్సీ రేటుకు ద‌క్కించుకుంది. నిర్మాత‌లు ఈ చిత్రాన్ని జూన్‌ లో విడుద‌ల చేయాల‌ని ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల బిజినెస్ హ‌క్కులు, శాటిలైట్ హ‌క్కులు కూడా అమ్ముడైపోయాయి. ఈ చిత్రాన్ని దీపాల ఆర్ట్స్ బ్యాన‌ర్‌ పై హెచ్‌ కె.శ్రీకాంత్ దీపాల నిర్మిస్తున్నారు.

పక్కా కామెడీ ఎంటర్ టైనర్ గా రానున్న ఈ సినిమాలో ఆది సరసన మిస్తీ చక్రబోర్తి , నైరా షా హీరోయిన్స్ గా నటిస్తుండగా సాయి కార్తీక్ సంగీతం అందిస్తున్నాడు.

సంబంధిత సమాచారం :

More