టీజర్ తో రానున్న యంగ్ హీరో !

Published on May 5, 2019 11:07 am IST

వరుస పరాజయాలతో కొనసాగుతున్న యంగ్ హీరో ఆది సాయి కుమార్ సరైన బ్రేక్ కోసం ఎదురుస్తున్నాడు. ప్రస్తుతం ఆది డైమండ్ రత్నబాబు తెరకెక్కిస్తున్న బుర్రకథ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం యొక్క టీజర్ రేపు ఉదయం 9:09 గంటలకు విడుదలకానుంది.

అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మిస్తీ చక్రబోర్తి , నైరా షా కథానాయికలుగా నటిస్తుండగా సాయి కార్తీక్ సంగీతం అందిస్తున్నాడు. శ్రీకాంత్ దీపాల నిర్మిస్తున్న ఈ చిత్రం మే 24న విడుదలకానుంది. ఇక ఆది ఈసినిమా తో పాటు ‘ఆపరేషన్ గోల్డ్ ఫిష్’ , జోడి’ , అనే చిత్రాల్లో నటిస్తున్నాడు. ఈ రెండు సినిమాలు కూడా ఈఏడాది లోనే విడుదలకానున్నాయి.

సంబంధిత సమాచారం :

More