600 మిలియన్ వ్యూస్ తో సెన్సేషన్ నమోదు చేసిన బుట్టబొమ్మ.!

Published on May 4, 2021 7:12 am IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ చిత్రం “అల వైకుంఠపురములో”. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంమ్లో తెరకెక్కించిన ఈ చిత్రం భారీ హిట్ గా నిలిచింది. అయితే ఈ సినిమాకు థమన్ ఇచ్చిన సంగీతం కూడా ఎంత పెద్ద హిట్టయ్యిందో కూడా మనకి తెలిసిందే. ప్రతీ పాట కూడా బిగ్గెస్ట్ చార్ట్ బస్టర్ అయ్యింది. అలాగే ఈ పాటలలో బుట్ట బొమ్మ సెన్సేషన్ అయితే అంతా ఇంత కాదు.

గత కొంత కాలం కితమే హాఫ్ బిలియన్ అంటే 500 మిలియన్ సెన్సేషనల్ మార్క్ అందుకున్న ఈ సాంగ్ లేటెస్ట్ గా 600 మిలియన్ మార్క్ తో మన తెలుగు నుంచి నయా రికార్డు సెట్ చేసింది. దీనితో ఈ సినిమా మ్యూజిక్ కొనుగోలు చేసిన ఆదిత్య మ్యూజిక్ వారు లోకల్ నుంచి వార్నర్ వరకు ప్రపంచ వ్యాప్తంగా ఈ సాంగ్ కాంకుర్ చేసింది అని తెలియజేసారు. మొత్తానికి మాత్రం ఈ సాంగ్ ఇప్పుడప్పుడే అలాగేలా లేదని చెప్పాలి.

సంబంధిత సమాచారం :