బన్నీ రికార్డుల ప్రభంజనం ఆగడం లేదుగా..!

Published on Jul 4, 2020 2:32 pm IST

అల్లు అర్జున్ 2020 ప్రారంభంలోనే అల వైకుంఠపురంలో మూవీతో మెమరబుల్ హిట్ అందుకున్నారు. భారీ వసూళ్లు అనుకున్న ఆ చిత్రం టాలీవుడ్ టాప్ గ్రాసర్స్ లో ఒకటిగా నిలిచిందింది. బన్నీ-త్రివిక్రమ్ ల హ్యాట్రిక్ మూవీగా వచ్చిన ఈ చిత్రం రికార్డుల దుమ్ము దులిపింది. కాగా ఈ చిత్ర విజయంలో థమన్ అందించిన సాంగ్స్ కీలక పాత్ర పోషించాయి. సినిమాలోని అన్ని పాటలు బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ అందుకున్నాయి.

అందులో బుట్ట బొమ్మ వీడియో సాంగ్ రికారులపై రికార్డులు కొడుతుంది. దేశం మొత్తాన్ని ఊపేసిన ఈ సాంగ్ యూట్యూబ్ లో మరో అరుదైన రికార్డు అందుకుంది. బుట్ట బొమ్మా వీడియో సాంగ్ ఏకంగా 250 మిలియన్ వ్యూస్ దక్కించుకుంది. అంటే ఈ సాంగ్ ని 25కోట్ల మంది చేసారన్న మాట. అంత మందికి ఆ పాట నచ్చడం అనేది మాములు విషయం కాదు.

సంబంధిత సమాచారం :

More