“సాహో” లో స్పెషల్ అప్పీరెన్స్ రోల్ ని తిరస్కరించిన సల్మాన్

Published on May 22, 2019 11:10 am IST

నిన్న ప్రభాస్ విడుదల చేసిన “సాహో” ఫస్ట్ లుక్ విడుదల తేదీ పోస్టర్ దేశవ్యాప్తంగా సోషల్ మీడియాలో ప్రకంపనలు రేపింది. ప్రభాస్ ఫ్యాన్స్ కి కిక్కెకించే మరో న్యూస్ ఇప్పుడు టాక్ అఫ్ ది ఇండస్ట్రీ ఐనది. అదేంటంటే బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ “సాహో” లో స్పెషల్ అప్పీరెన్స్ ఇవ్వనున్నారని.ఓ ప్రముఖ ఆంగ్ల పత్రిక ప్రముఖంగా ఓ ఆర్టికల్ ప్రచురించడం జరిగింది.

దాని ప్రకారం “సాహో” లో ప్రతినాయకుడిగా చేస్తున్న నీల్ నితిన్ ముఖేష్ సల్మాన్ కి మంచి మితృడుకావడంతో , ఓ ముఖ్య క్యామియో రోల్ కి సల్మాన్ పేరును నిర్మాతలకు సిపార్సు చేసాడంట. దానితో నిర్మాతలు సల్మాన్ ఖాన్ ని కలవడం జరిగిందంట. ఐతే ఈ రోల్ ని సున్నితంగా తిరస్కరించారంట సల్మాన్.ప్రస్తుతం సల్మాన్ తన లేటెస్ట్ మూవీ “భరత్” ప్రమోషన్స్ లో బిజీ గా ఉన్నారు.

యంగ్ డైరెక్టర్ సుజీత్ తెరకెక్కిస్తున్న ఈ మూవీ ని యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. శ్రద్ద కపూర్ ప్రభాస్ కి జోడిగా నటిస్తున్న విషయం తెలిసిందే

సంబంధిత సమాచారం :

More