సంక్రాంతి బరి నుంచి ఈ సినిమా తప్పుకుందా..?

సంక్రాంతి బరి నుంచి ఈ సినిమా తప్పుకుందా..?

Published on Jan 7, 2026 12:30 AM IST

Parashakthi

శివకార్తికేయన్ హీరోగా తెరకెక్కుతున్న ‘పరాశక్తి’ (Parasakthi) సినిమా పొంగల్ స్పెషల్‌గా జనవరి 10, 2026న థియేటర్లలో విడుదలకు సిద్ధమైంది. సుధా కొంగర దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం తమిళనాడులో జరిగిన హిందీ వ్యతిరేక ఉద్యమానికి సంబంధించిన నిజ సంఘటనల ఆధారంగా తెరకెక్కింది. మొదట ఈ సినిమాను తెలుగు భాషలో కూడా ఒకేసారి విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు.

కానీ తాజా సమాచారం ప్రకారం, తెలుగు డబ్బింగ్ వెర్షన్ విడుదల వాయిదా పడే అవకాశం ఉంది. జనవరి 23కి తెలుగు రిలీజ్‌ను ప్లాన్ చేస్తున్నారని బజ్ వినిపిస్తోంది. ప్రస్తుతం తెలుగు వెర్షన్‌కు సంబంధించిన ప్రమోషన్స్ మొదలుకాలేదు. ట్రైలర్ కూడా ఇంకా విడుదల కాలేదు. సంక్రాంతి సీజన్‌లో టాలీవుడ్‌లో ఇప్పటికే భారీగా సినిమాలు విడుదలవుతున్న నేపథ్యంలో, థియేటర్ల కొరత ఉండే అవకాశం ఉంది. అందుకే తెలుగు రిలీజ్‌ను వాయిదా వేయడం అన్ని సినిమాలకు, ముఖ్యంగా ‘పరాశక్తి’ (Parasakthi) కే ఉపయోగకరంగా ఉంటుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.

ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తుండగా, రవి మోహన్ ప్రతినాయక పాత్రలో కనిపించనున్నారు. అలాగే రానా దగ్గుబాటి, అతర్వా, బాసిల్ జోసఫ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. డాన్ పిక్చర్స్ బ్యానర్‌పై ఆకాశ్ బాస్కరన్ ఈ సినిమాను నిర్మిస్తుండగా, జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు