దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో ప్రెస్టీజియస్ చిత్రం ‘వారణాసి’ని రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను విజువల్ వండర్‌గా తెరకెక్కించి గ్లోబల్ స్థాయిలో అందరికీ షాకిచ్చేందుకు జక్కన్న అండ్ టీమ్ రెడీ అవుతున్నారు. అయితే, రాజమౌళి ‘వారణాసి’ తర్వాత నెక్స్ట్ చిత్రం ఎవరితో చేస్తారనే విషయంపై సినీ సర్కిల్స్‌లో ఓ కొత్త బజ్ చక్కర్లు కొడుతోంది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప’, ‘పుష్ప-2’ చిత్రాలతో పాన్ ఇండియా స్టార్‌గా మారాడు. ఇక ఆయన ప్రస్తుతం అట్లీ డైరెక్షన్‌లో AA22xA6 ప్రాజెక్ట్‌లో నటిస్తున్నాడు. అయితే, ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ రాజమౌళి కాంబోలో ఓ సినిమా వస్తుందనే ప్రచారం సాగుతోంది. దీని కోసం రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథను కూడా రాస్తున్నారని.. ఇది పూర్తిగా ట్రైబల్ నేపథ్యంలో సాగనుందనే టాక్ జోరుగా నడుస్తోంది.
మరి నిజంగానే అల్లు అర్జున్ – రాజమౌళి కాంబో ఫిక్స్ అవుతుందా.. విజయేంద్ర ప్రసాద్ నిజంగానే ట్రైబల్ కథను రెడీ చేస్తున్నారా..? అనే ప్రశ్నలకు సమాధానం రావాలంటే కొంత కాలం వెయిట్ చేయాల్సిందే.


