రూటు మారుస్తున్న మాస్ రాజా.. ఈసారి హిట్టు కొట్టేనా..?

రూటు మారుస్తున్న మాస్ రాజా.. ఈసారి హిట్టు కొట్టేనా..?

Published on Dec 16, 2025 10:02 PM IST

Ravi Teja

మాస్ రాజా రవితేజ ప్రస్తుతం వరుస ఫెయిల్యూర్స్‌తో సతమతమవుతున్నాడు. ఆయన నటించిన సినిమాలు వరుసగా బాక్సాఫీస్ దగ్గర ఫ్లాపులుగా మిగులుతున్నాయి. దీంతో ఆయన ఓ సాలిడ్ హిట్‌తో కమ్ బ్యాక్ ఇవ్వాలని అభిమానులు కోరుతున్నారు. ఇక ఆయన ప్రస్తుతం తన లేటెస్ట్ చిత్రం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ని సంక్రాంతి కానుకగా రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమాను కిషోర్ తిరుమల డైరెక్ట్ చేస్తున్నారు.

కాగా, ఇటీవల దర్శకుడు వశిష్ఠ రవితేజకు ఓ సైన్స్ ఫిక్షన్ జోనర్ కథను వినిపించాడని తెలుస్తోంది. ఈ సినిమా కథ నచ్చడంతో రవితేజ ఆయనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ఇక ఈ సినిమాతో రవితేజ తన రూటు మార్చి తొలిసారి సైన్స్ ఫిక్షన్ కథను చేయబోతున్నారు.

దీంతో అభిమానుల్లో ఈ కాంబినేషన్‌పై ఆసక్తి క్రియేట్ అవుతుంది. ఇక ఈ సినిమాను 2026 ద్వితీయార్థంలో ప్రారంభించేందుకు వశిష్ఠ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. మరి ఈ జోనర్‌లో రవితేజ ఎలాంటి హిట్ అందుకుంటాడో చూడాలి.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు