ప్రస్తుతం టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ మూవీ SSMB29 కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను గతంలోనే అనౌన్స్ చేసినా, రీసెంట్‌గా ఈ చిత్రాన్ని ప్రారంభించారు. ఇక ఈ సినిమాతో సూపర్ స్టార్ మహేష్ బాబు ఇండియన్ రికార్డులు తిరగరాయడం ఖాయమని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాగా దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి ఈ సినిమాతో మరోసారి తన సత్తా ఏమిటో చూపించేందుకు సిద్ధమవుతున్నారు.
అయితే, ఈ సినిమా విషయంలో జక్కన్న చాలా జాగ్రత్తగా క్యాస్టింగ్ సెలక్షన్ చేస్తున్నట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ఫీమేల్ లీడ్‌గా స్టార్ బ్యూటీ ప్రియాంక చోప్రాను సెలెక్ట్ చేశాడని.. ఆమె సినిమాలో జాయిన్ కూడా అయ్యిందని తెలుస్తోంది. కాగా, ఈ సినిమాలో విలక్షణ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ఓ కీలక పాత్రలో నటించబోతున్నాడనే టాక్ గతంలో వినిపించింది. కానీ, ఇప్పుడు ఆయన స్థానంలో ఈ సినిమాలో నటించేందుకు బాలీవుడ్ హీరో జాన్ అబ్రహం సెలెక్ట్ అయ్యాడని తెలుస్తోంది.
ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమాను కంప్లీట్ అడ్వెంచర్ థ్రిల్లర్‌గా తెరకెక్కించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతున్నారు. ఆస్కార్ అవార్డ్ విన్నర్ ఎం.ఎం.కీరవాణి సంగీతం అందించనుండగా, కెఎల్.నారాయణ ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తున్నారు.