ఈరోజు ‘సాహో’ అప్డేట్.. సంగతేంటి ?

Published on May 27, 2019 1:00 pm IST

సుజీత్ డైరెక్షన్లో ప్రభాస్ నటిస్తున్న ‘సాహో’ చిత్రం షూటింగ్ చివరి దశ పనుల్లో ఉంది. ఆగష్టు 15వ తేదీ సినిమా విడుదలపై కూడా ఫుల్ క్లారిటీ వచ్చేసింది. దీంతో టీమ్ నుండి కొత్త అప్డేట్స్ ఎప్పుడెప్పుడు వస్తాయా అని ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. గతంలో షేడ్స్ ఆఫ్ సాహో పేరుతో రెండు వీడియోలను రిలీజ్ చేసినా పూర్తిస్థాయి టీజర్, ట్రైలర్ కోసం అభిమానులు, సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఉన్నారు.

ఇదిలా ఉంటే చిత్ర సన్నిహిత వర్గాలు ఈరోజు సినిమా గురించిన కెలక అప్డేట్ వచ్చే అవకాశం ఉందనే హింట్స్ వస్తున్నాయి. అయితే ఆ అప్డేట్ ఏమిటి, ఏ సమయంలో బయటికొస్తుంది అనేది మాత్రం చెప్పడంలేదు. అభిమానులైతే కొందరు టీజర్ అప్డేట్ అని, ఇంకొందరు పాత్రల్ని రివీల్ చేసే టీజర్ అని ఎవరికీ తోచింది వారు చెప్పుకుంటున్నారు. మరి నిజంగా ఈరోజు అప్డేట్ ఉందా ఉంటే ఎన్ని గంటలకు, అది ఎలాంటి అప్డేట్ అనే వివరాల్ని టీమ్ సవివరంగా ప్రకటిస్తే బాగుంటుంది.

సంబంధిత సమాచారం :

More