సాయి ధ‌ర‌మ్ తేజ్ మూవీ ఇప్ప‌ట్లో లేన‌ట్టేనా..?

సాయి ధ‌ర‌మ్ తేజ్ మూవీ ఇప్ప‌ట్లో లేన‌ట్టేనా..?

Published on Jul 9, 2024 9:00 PM IST

సుప్రీం హీరో సాయి ధ‌ర‌మ్ తేజ్ లాస్ట్ మూవీ విరూపాక్ష బాక్సాఫీస్ వ‌ద్ద బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచింది. ఇక ఈ సినిమా తరువాత ఆయ‌న సంప‌త్ నంది డైరెక్ష‌న్ లో ఓ సినిమా చేయాల్సి ఉంది. కానీ, కొన్ని కార‌ణాల వ‌ల్ల ఇప్పుడు అది వాయిదా ప‌డింది. ఇక రీసెంట్ గా కొత్త ద‌ర్శ‌కుడు రోహిత్ డైరెక్ష‌న్ లో SDT18 మూవీని అనౌన్స్ చేశాడు తేజు.

కాగా, ఈ సినిమా షూటింగ్ కూడా ఇప్ప‌టికే స్టార్ట్ అయ్యింది. ఈ సినిమా ఓ పీరియాడిక్ క‌థ‌తో తెర‌కెక్కుతున్న‌ట్లుగా తెలుస్తోంది. అయితే, ఈ సినిమాను తేజు కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ‌డ్జెట్ మూవీగా తెర‌కెక్కిస్తున్నారు. కాగా, ఈ సినిమా రిలీజ్ పై నిర్మాత‌ల్లో ఒక‌రైన చ‌త‌న్య రెడ్డి తాజాగా ఓ క్లూ ఇచ్చారు. ఈ సినిమాను వ‌చ్చే ఏడాది ఆగస్టు త‌రువాత రిలీజ్ చేస్తామ‌ని ఆమె తెలిపారు.

ఈ సినిమాకు అనుకున్న దానికంటే కూడా ఎక్కువ బ‌డ్జెట్ అవుతున్న‌ట్లుగా తెలుస్తోంది. దీంతో ఈ సినిమాను ప‌ర్ఫెక్ట్ గా తీర్చిదిద్దేందుకు మేక‌ర్స్ ప్ర‌య‌త్నిస్తున్నారు. ఇక ఈ సినిమాలో ఐశ్వ‌ర్య ల‌క్ష్మి హీరోయిన్ గా న‌టిస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు