రెండు భారీ సినిమాలకు సిద్దమవుతున్న బడా నిర్మాత !

ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ త్వరలో రెండు భారీ ప్రాజెక్ట్స్ చేయడానికి సిద్దమవుతున్నారట. ఇప్పటికే వినాయక్ దర్వకత్వంలో బాలయ్య హీరోగా ఒక సినిమాను అనౌన్స్ చేసిన సి.కళ్యాణ్ అల్లు అర్జున్ తో కూడ సినిమా చేయనున్నారని వినికిడి.

అల్లు అర్జున్ కు సంపత్ నంది ఒక సబ్జెక్ట్ చెప్పాడని చెప్పారట. అన్నీ కుదిరితే ‘నా పేరు సూర్య’ సినిమా తరువాత సంపత్ నంది, బన్ని సినిమా ప్రారంభం కానుందని తెలుస్తోంది. ‘ఇంటిలిజెంట్’ సినిమా తరువాత సి. కళ్యాణ్ నిర్మించబోయే రెండు భారీ సినిమాలు ఇవే. త్వరలో ఈ ప్రాజెక్ట్స్ గురించి మరింత క్లారిటి వచ్చే అవకాశం ఉంది.