‘దర్బార్’ను టీవీలో ప్రసారం చేసిన కేబుల్ టీవీ ఓనర్ అరెస్ట్

Published on Jan 14, 2020 9:00 pm IST

సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన ‘దర్బార్’ చిత్రం ఇటీవలే విడుదలై మంచి వసూళ్లను సాధిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రానికి ఆన్ లైన్ పైరసీ బెడద ఎక్కువైంది. దీన్ని అరికట్టడానికి చిత్ర బృందం కృషి చేస్తుండగా మధురైలోని ఒక లోకల్ కేబుల్ టీవీలో సినిమా ప్రసారమవడం కలకలం రేపింది. ఇది చూసి ఖంగుతిన్న చిత్ర యూనిట్ పోలీసులకు పిర్యాధు చేశారు.

పిర్యాధుతో రంగంలోకి దిగిన పోలీసులు సదరు కేబుల్ టీవీ యజమానిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. పైరసీ వెర్షన్ ఎక్కడి నుండి వచ్చిందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇకపోతే మురుగదాస్ డైరెక్షన్లో రూపొందిన ఈ చిత్రం తమిళనాడులోనే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో, ఓవర్సీస్లో మంచి వసూళ్లనే రాబడుతోంది.

సంబంధిత సమాచారం :

X
More