చరణ్ కూడా ఆ మ్యాజిక్ ఫిగర్ అందుకుంటాడా.?

Published on Oct 28, 2020 8:04 am IST

ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లతో దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ పీరియాడిక్ చిత్రం “రౌద్రం రణం రుధిరం”. మాములుగా ఒక స్టార్ హీరో సినిమా వస్తుంది అంటేనే ఆ సినిమాకు సంబంధించి ప్రతీ చిన్న విషయంలో రికార్డులను వెతుక్కుంటారు మన వాళ్ళు కానీ అలాంటిది ఇద్దరు పవర్ ఫుల్ మాస్ హీరోలతో ఇలాంటి సినిమా తీస్తే ఇక రికార్డుల మోత వేరే స్థాయిలో ఉంటుంది.

అందుకు తగ్గట్టుగానే చాలా కాలం నిరీక్షణ అనంతరం తారక్ పై డిజైన్ చేసిన టీజర్ ను వదలగా దానిని కాస్తా 1 మిలియన్ లైక్స్ తో ఫస్ట్ ఎవర్ టాలీవుడ్ టీజర్ గా నిలిపారు. అయితే అంతకు ముందే విడుదల చేసిన రామరాజు టీజర్ కూడా అప్పట్లో అంతే స్థాయి రెస్పాన్స్ ను రాబట్టుకుంది. కానీ రామరాజు టీజర్ ఇప్పటికీ ఈ టీజర్ కూడా భారీ లెక్కలనే అందుకుంటుంది.

లేటెస్ట్ గా 32 మిలియన్ వ్యూస్ మార్క్ క్రాస్ చెయ్యడమే కాకుండా 8 లక్షల లైక్స్ మార్క్ ను కూడా దాటేసింది. దీనితో కొమరం భీం టీజర్ కాస్త ముందుగానే అందుకున్న సాలిడ్ రికార్డును అల్లూరిగా చరణ్ టీజర్ కూడా లైఫ్ టైం లో అందుకునే విధంగా కనిపిస్తున్నాడు. మిగతా ఇతర రికార్డులతో పోలిస్తే ఇది మాతరం కాస్త ప్రెస్టేజియస్ రికార్డే మరి చరణ్ దీనిని ఎప్పుడు అందుకుంటాడో చూడాలి.

సంబంధిత సమాచారం :

More