ఇక తారక్ పవర్ ఫుల్ ప్రాజెక్ట్ షురూ అనుకోవచ్చా.?

Published on Oct 27, 2020 10:00 am IST

ఇప్పుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా పాన్ ఇండియన్ స్టార్ అయ్యిపోయినట్టే అని చెప్పాలి. తాను నటిస్తున్న తాజా చిత్రం “రౌద్రం రణం రుధిరం” నుంచి వచ్చిన భీం టీజర్ చూసి అది ఫిక్సయ్యిపోవచ్చు. ఇక ఈ చిత్రం తర్వాత నెక్స్ట్ ఎవరితోనా అన్నది కాస్త ఆసక్తికరంగా నెలకొంది.

ఈ సినిమా లైన్ లో ఉండగానే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో ఒక ప్రాజెక్ట్ ను ఓకే చేసేసారు. అది బాగానే ఉంది అనుకునే లోపు కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో ఒక పవర్ ఫుల్ పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ ను ఓకే చేసెయ్యడంతో ఈ మాస్ కాంబోపై ఎనలేని అంచనాలు నెలకొన్నాయి.

దీనితో ఈ సినిమా ఎప్పుడు మొదలు అవుతుందా తారక్ అభిమానులు ఎదురు చూస్తున్నారు. కానీ అంతకు ముందు త్రివిక్రమ్ తో చెయ్యాల్సి ఉంది. అయితే ఇప్పుడు త్రివిక్రమ్ రామ్ తో ఒక సినిమా కమిట్ అయ్యారు. దీనితో ఆ ప్రాజెక్ట్ కు సమయం దొరికినట్టే అని చెప్పొచ్చు.

కాస్త సమయం అటు ఇటుగా అయితే RRR పూర్తయ్యేసరికి త్రివిక్రమ్ రామ్ సినిమాతో బిజీగా ఉన్నా అప్పటికి ప్రశాంత్ నీల్ కూడా ఖాళీ అయ్యిపోతారు కాబట్టి తారక్ తో సినిమా మొదలు పెట్టరు అని కూడా చెప్పలేము. మొత్తానికి మాత్రం ఈ కొత్త రకం స్పెక్యులేషన్స్ ఈ మోస్ట్ వాంటెడ్ ప్రాజెక్ట్ పై మరింత ఆసక్తిని రేపుతున్నాయి.

సంబంధిత సమాచారం :

More