Subscribe to our Youtube Channel
 
Like us on Facebook
 
ఇంటర్వ్యూ : మహా వెంకటేష్ – నా కథలు విన్నాక, మా ఫ్రెండ్స్ నన్ను ఏలియన్ అని పిలిచేవాళ్ళు.
Published on Sep 6, 2018 5:33 pm IST

నూతన దర్శకుడు మహా వెంకటేష్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘కేరాఫ్ కంచెర పాలెం’. ప్రముఖ నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ పతాకం పై ‘రానా దగ్గుబాటి’ సమర్పిస్తున్న ఈ చిత్రానికి స్వీకర్ అగస్తి సంగీతం అందించారు. సుబ్బరావు, రాధా బెస్సె, కెసవ కె, నిత్య శ్రీ తదితరులు నటించగా పరుచూరి విజయ ప్రవీణా నిర్మించారు. కాగా ఈ చిత్రం రేపు విడుదలవ్వబోతుంది. ఈ సందర్భంగా ఈ చిత్ర దర్శకుడు మహా మీడియాతో మాట్లాడారు ఆ విశేషాలు ఇప్పుడు మీ కోసం…

అసలు మీకు ‘కంచెర పాలెం’ సినిమాని అంత రియలిస్టిక్ గా తీయ్యాలనే థాట్ ఎలా వచ్చింది ?

అంటే నేను 2009 నుండి ఇండస్ట్రీలో యాక్టివ్ గా ఉన్నానండి. నా కెరీర్ ఒక సెట్ బాయ్ గా స్టార్ట్ అయింది ఆ తర్వాత చాలా టీవీ షో లకి అసిస్టెంట్ డైరెక్టర్ గా, కో డైరెక్టర్ గా వర్క్ చేశాను. ఆ ఎక్స్ పీరియన్స్ చాలా బాగా ఉపయోగపడింది. ఇక కంచెర పాలెం సినిమాకి వస్తే.. ఇండస్ట్రీలో ఏ ఛాన్స్ రాని టైంలో.. కొన్నాళ్ళు గ్యాప్ తీసుకుందామని కంచెరపాలెం ఊరికి వెళ్ళటం జరిగింది. ఆ ఊరు వెళ్లిన సాయంత్రమే నాకు ఈ కంచెరపాలెం మూవీ ఐడియా వచ్చింది. ఇక అక్కడే ఓ అరుగు మీద కూర్చుని.. వచ్చి పోయే జనాన్ని చూస్తూ.. వారి గురించి తెలుసుకుంటూ ఈ స్క్రిప్ట్ రాశాను.

మీరు యాక్టర్ అవుదామని ఇండస్ట్రీకి వచ్చారట ?

అవును అండి. నా కెరీర్ యాక్టర్ గా స్టార్ట్ గానే అయింది,కొన్ని మూవీస్ లో చిన్న చిన్న రోల్స్ కూడా చేశాను. అదే టైంలో వేరే వేరే జాబ్స్ కూడా చేశాను. ఆ ప్రాసెస్ లోనే సెట్ బాయ్ గా కూడా వర్క్ చేశాను. అందుకేనేమో, నేను డైరెక్షన్ చేస్తానంటే నన్ను ఎవ్వరూ నమ్మలేదు. నా పక్కన ఉన్న వాళ్ళు కూడా నన్ను నమ్మలేదు. బట్ నా డైరెక్షన్ గురించి గాని, నా గోల్ గురించి గాని నాకు ఫుల్ క్లారిటీ ఉంది. కానీ అది ఎవ్వరికి అర్ధం కాలేదు. ఆ టైంలోనే నేను మొత్తం సర్దుకొని బైక్ మీదే కంచెరపాలెం వెళ్ళిపోయాను.

మీరు కథ రాసుకున్న తర్వాత కంచెర పాలెంలోనే ముఖ్యంగా ఆ ఊరి వాళ్ళతోనే సినిమా తీస్తున్నానంటే ఫస్ట్ వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యారు ?

నేను ఫస్ట్ కంచెరపాలెంలోనే ఆ ఊరి జనంతోనే సినిమా తీద్దామనుకుంటున్నానని ఫస్ట్ మా ఫ్రెండ్ తో చెప్పాను. వాడు షాకై.. ఇక్కడ వీళ్ళెవ్వరూ యాక్టర్స్ కాదు కదా అని క్వశ్చన్ చేశాడు. బట్ నాకు మాత్రం వాళ్ళు యాక్టింగ్ మీద నమ్మకం ఉంది. వారితోనే చిన్న డెమో లాగా చేశాను. ఆ డెమో చూసే పరుచూరి ప్రవీణాగారు సినిమా చేద్దాం అని పాజిటివ్ గా రియాక్ట్ అయ్యారు. ఓవరాల్ గా కంచెరపాలెం సినిమా స్టార్ట్ అవ్వడం జరిగింది.

ఈ సినిమా అంతా కొత్తవారితో తీశారు. మరి షూటింగ్ ప్రాసెస్ బాగా లేట్ అయి ఉంటుంది కదా ?

లేదండి. చాలా ఈజీగానే చేసేశాము. అదే ప్యాడింగ్ అయి ఉంటే ఖచ్చితంగా టైం పట్టేది. వాళ్ళు కొత్తవారు యాక్టింగ్ మీద ఫ్యాషన్ ఉన్నవారు కాబట్టి చాలా కష్టపడి ఇష్టపడి చేశారు.

ఈ సినిమాకి మెయిన్ ‘రాజు క్యారెక్టర్’. ఆ క్యారెక్టర్ సుబ్బారావును తీసుకోవటానికి కారణం ఏమిటి ?

అసలు ఈ సినిమాలో రాజు క్యారెక్టర్ పుట్టిందే.. ఆయన (సుబ్బారావు) లైఫ్ లో నించి. ఆయన గురించి తెలుసుకుంటున్న ప్రాసెస్ లో రాజు క్యారెక్టర్ డెవలప్ చేసుకుంటూ వచ్చాను. ఫైనల్ గా నాలుగు లవ్ స్టోరీస్ వచ్చాయి.

సినిమా రిలీజ్ అవ్వకముందే, ప్రివ్యూలతో సినిమా సూపర్ హిట్ టాక్ వచ్చేసింది. మరి నెక్స్ట్ మీ ప్లానింగ్స్ ఏమిటి ?

ప్రస్తుతం అయితే.. యూఎస్ లో ఓ ఫిల్మ్ కోర్స్ చేయబోతున్నాను. దాని తర్వాత ఇంతకు ముందే రాసుకున్న కొన్ని కథలు ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు చెప్పలేను గాని, బట్ తర్వాత నేను ఎప్పుడు సినిమా చేసినా.. నేను కొత్తగా ఫీల్ అయిందే చేస్తాను.

ఈ సినిమా గురించి తెలుగు ఇండస్ట్రీలోని టాప్ డైరెక్టర్స్ అందరూ చాలా గొప్పగా చెప్పారు. ఆ మాటలు విన్నప్పుడు మీకు ఏమనిపించింది ?

ఫస్ట్ నేను ఈ విషయంలో చాలామందికి థాంక్స్ చెప్పాలి. రాజమౌళిగారికి, శేఖర్ కమ్ములగారికి, క్రిష్ గారికి, సుకుమార్ గారికి.. ఇలా చాలామంది స్టార్ డైరెక్టర్స్ ఉన్నారు. నిజంగా వాళ్ళు చాలా బిజీగా ఉన్నప్పటికీ.. ఓ చిన్న మా సినిమాని చూసి, దాన్ని గురించి వారికీ కలిగిన స్పందనను మీడియా ఎదురుగా ప్రజలకు చెప్పడం అనేది వారి గొప్పతనం అండి. వాళ్ళు అలా వాళ్ళకి కలిగిన స్పందనను చెప్పబట్టే ఈ రోజు మా సినిమా మీద ఓ ఎక్స్ పెటేషన్స్ ఏర్పడ్డాయి.

మను ఫంక్షన్ లో కూడా డైరెక్టర్ క్రిష్ గారు ప్రధానంగా మీ రైటింగ్ గురించి చాలా బాగా పొగిడారు ?

అవును. క్రిష్ గారి మాటలు నాకు చాలా బాగా ఎంకరేజ్ గా అనిపించాయి. నేను డైరెక్టర్ అవ్వడానికి ఆయన కూడా ప్రేరణే. అలాంటి ఆయన నా గురించి అలా చెప్పటం నేను జీవితంలో మర్చిపోలేను. అయితే మీకు ఒక విషయం చెప్పాలి. నేను కంచెరపాలెం సినిమా తియ్యకముందు.. రూమ్ లో ఎప్పుడన్నా మా ఫ్రెండ్స్ కి నేను కథ చెబితే.. వాళ్ళు నా వైపు చూస్తూ.. చీప్ గా కింద నుంచి పైకి ఒక లుక్ ఇచ్చేవాళ్ళు. నిజం చెప్పాలంటే నా కథలు విన్నాక, వాళ్ళు నన్ను ఏలియన్ అని పిలిచేవాళ్ళు. ఇప్పుడు నా రైటింగ్ గురించి చాలా గొప్పగా చెబుతుంటే చాలా హ్యాపీగా ఉంది.

మీరు మూవీ డైరెక్ట్ చేసాక, మళ్లీ డైరెక్షన్ కోర్స్ చెయ్యటం ఏమిటి ?

అంటే నాకు విఎఫ్ఎక్స్ సినిమాలు అంటే చాలా బాగా ఇష్టం అండి. కానీ నాకు ఎప్పుడూ అలాంటి సినిమాలకి పని చేసే అవకాశం రాలేదు. అందుకే ఇప్పుడు నేను విఎఫ్ఎక్స్ కోర్స్ నేర్చుకోవటానికే అమెరికా వెళ్ళబోతున్నాను.

  • 28
  •  
  •  
  •  

సంబంధిత సమాచారం :