వివాదంలో అమలా పాల్ చిత్రం,ఆ సన్నివేశాలపై పిర్యాదు.

Published on Jul 18, 2019 7:23 pm IST

నటి అమలా పాల్ ప్రధాన పాత్రలో దర్శకుడు రత్న కుమార్ దర్శకత్వంలో ఓ విభిన్న కథాంశంతో తెరకెక్కిన చిత్రం తమిళ చిత్రం “ఆడై”. వి స్టూడియోస్ బ్యానర్ నిర్మాణంలో రూపొందుకున్న సస్పెన్సు థ్రిల్లర్ “ఆడై” రేపు ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున్న విడుదల కానుంది. తెలుగులో ఈ చిత్రాన్ని సీనియర్ దర్శకులు,నిర్మాత అయిన తమ్మారెడ్డి భరద్వాజ ‘ఆమె’గా విడుదల చేస్తున్నారు.

ఐతే ఈ చిత్రం ప్రస్తుతం ఓ వివాదంలో చిక్కుకుంది. అదేంటంటే అమలా పాల్ ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలలో బట్టలు లేకుండా న్యూడ్ గా నటించారు. ఆసన్నివేశాలకు సంబందించిన క్లిప్పింగ్స్ టీజర్ లో చూపించడం జరిగింది. ఐతే అమలాపాల్ నటించిన ‘ఆమె’ సినిమాలో నగ్న దృశ్యాలు, ఆ సినిమా పోస్టర్లు సమాజానికి కీడు చేసేవిగా ఉన్నాయని, కాబట్టి వాటిపై నిషేధం విధించాలని కోరుతూ చెన్నైకి చెందిన రాజేశ్వరి ప్రియ అనే మహిళ బుధవారం చెన్నైలోని డీజీపీ ఆఫీస్ లో ఫిర్యాదు చేసింది.ఈ ఫిర్యాదుపై స్పందించిన సదరు అధికారులు విచారణ చేస్తాం అని చెప్పారట. రేపు విడుదల కానున్న నేపథ్యంలో ఇలాంటి వివాదాలు ఆడై సినిమాకు ఇబ్బందులుగా మారాయి.

సంబంధిత సమాచారం :