కొన్నిరోజుల క్రితం మేం ప్రకటించినట్టు చంద్రబాబు నాయుడు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ కి సీమంద్రలో పెట్టుబడులు పెట్టేవిధంగా మంచి తాయిలాలతో ప్రోత్సాహిస్తున్నారు. ఈ ప్రత్యేక ప్యాకేజి లో ప్రోత్సాహాకాలతో పాటు పన్ను మినహాయింపులు మరియు స్థలాలు కేటాయించడం వున్నాయి.
ఫిలిం ఇండస్ట్రీ వల్ల ఉద్యోగావకాశాలు పెరగడం తో రాష్ట్రానికి రాబడి వస్తుంది అందువల్లే చంద్రబాబు నాయుడు ఇండస్ట్రీలోని పెద్దవారిని ఆకర్షించే పనిలో వున్నారు. ఇప్పటికే హైదరాబాద్ లో సెటిల్ అయిన ఇండస్ట్రీ అక్కడే వుంటుంది కాబట్టి కొత్త వెంచర్లు సీమంద్రలో ఏర్పాటు అయ్యే అవకాశం వుంది.
చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గా ప్రమాణస్వీకారం చేసాక ఈ వార్త అధికారికంగా వెల్లడికానుంది. కొంతమంది ఇండస్ట్రీ పెద్దలు ఈ ప్రత్యేక ప్యాకేజ్ పై శ్రద్ధ కనబరుస్తున్నారని సమాచారం.


