‘రుద్రమదేవి’ బెనిఫిట్ షోలో సెలబ్రిటీస్ హంగామా.!

‘రుద్రమదేవి’ బెనిఫిట్ షోలో సెలబ్రిటీస్ హంగామా.!

Published on Oct 7, 2015 12:56 PM IST

rudrama-devi-celebs
గత మూడేళ్ళుగా తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నభారీ బడ్జెట్ హిస్టారికల్ మూవీ ‘రుద్రమదేవి’. అన్ని ఆటంకాలను క్లియర్ చేసుకున్న ఈ సినిమా అక్టోబర్ 9న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్ కానుంది. ప్రస్తుతం ఈ చిత్ర టీం సినిమా ప్రమోషన్స్ లో బాగా బిజీ బిజీగా ఉంది. అనుష్క రుద్రమదేవిగా కనిపించనున్న ఈ సినిమాకి భారీ చిత్రాల దర్శకుడు గుణశేఖర్. ఇప్పటి వరకూ స్టార్ హీరోల సినిమాలకే బెనిఫిట్ షోస్ పడేవి, కానీ మొదటి సారి లేడీ ఓరియెంటెడ్ సినిమా యిన రుద్రమదేవికి కూడా బెనిఫిట్ షో వేస్తున్నారు.

అక్టోబర్ 8 అనగా గురువారం రాత్రి ఒంటి గంటకి హైదరాబాద్ మూసాపేట్ లోని శ్రీరాములు థియేటర్ లో స్పెషల్ బెనిఫిట్ షో వేయనున్నారు. ఈ సినిమ టికెట్స్ కి క్రేజ్ బాగుంది. లాగే ఈ బెనిఫిట్ షోకి ఈ చిత్ర డైరెక్టర్ గుణశేఖర్, టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజులతో పాటు ఈ చిత్ర టీం కూడా హాజరు కానుంది. వీరితో పాటు ఇండస్ట్రీలోని పలువురు ప్రముఖులు కూడా ఈ షో చూడటానికి వస్తున్నారు. అనుష్కతో పాటు రానా, అల్లు అర్జున్, నిత్యా మీనన్, కేథరిన్, కృష్ణంరాజు, ప్రకాష్ రాజ్, హంసా నందిని తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఇళయరాజా సంగీతం అందించిన ఈ సినిమా అంచనాలను అందుకుంటుందో లేదో తెలియాలంటే మరో రెండు రోజులు వేచి చూడాల్సిందే..

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు