డాలస్ లో ఉన్న గాంధీ విగ్రహాన్ని సందర్శించిన సినీ ప్రముఖులు

Published on May 25, 2019 10:45 am IST

డాలస్, టెక్సాస్ మే 23, 2019 : అమెరికా పర్యటన లో ఉన్న సుప్రసిద్ధ దర్శక నిర్మాత వై వి ఎస్ చౌదరి, ప్రముఖ సినీ గేయ రచయితలు రామజోగయ్య శాస్త్రి, భాస్కర భట్ల, సిరా శ్రీ మరియు కరాటే మార్షల్ ఆర్ట్స్ లో భారతదేశం నుండి అమెరికాలో జరిగిన అంతర్జాతీయ పోటీలలో పాల్గొని బంగారు పతకాన్ని కైవసం చేసుకున్న చేరుపల్లి వివేక్ తేజలు అమెరికా దేశంలో అతి పెద్దదైన డల్లాస్ లో నెలకొని ఉన్న జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహాన్ని సందర్శించి పుష్పగుచ్చాలు ఉంచి ఘన నివాళి అర్పించారు. 18 ఎకరాల సువిశాల విస్తీర్ణం కలిగిన సుందరమైన పార్కులో ఈ గాంధీ మెమోరియల్ ను ఏర్పాటు చేయడంలో ప్రముఖ పాత్ర వహించిన ఛైర్మన్ డా. ప్రసాద్ తోటకూర కృషిని విచ్చేసిన సినీ ప్రముఖులు అభినందించారు. ఎన్నో కార్యక్రమాలతో తీరిక లేకున్నా ప్రత్యేకంగా సమయాన్ని కేటాయించి గాంధీ స్మారకస్థలిని సందర్శించిన వీరందరికీ చైర్మన్ డా. ప్రసాద్ తోటకూర మహాత్మా గాంధీ మెమోరియల్ బోర్డు సభ్యులు తరపున కృతజ్ఞతలు తెలియజేశారు.

సంబంధిత సమాచారం :

More