అమలా పాల్ ‘ఆమె’కు ‘ఏ’ సర్టిఫికేట్, కారణం అదేనా?

Published on Jul 18, 2019 2:50 pm IST

అమలా పాల్ ప్రధాన పాత్రలో నటించిన తమిళ చిత్రం “ఆడై” తెలుగులో “ఆమె”గా ఈనెల 19న విడుదల కానుంది. దర్శకుడు రత్న కుమార్ సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కించగా దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ తెలుగులో విడుదల చేస్తున్నారు. టీజర్ ,ట్రైలర్ ఆసక్తికరంగా ఉండటంతో సినిమాకు తెలుగులో కూడా మంచి ప్రచారం దక్కింది.

కాగా సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఆమె చిత్రానికి సెన్సార్ సభ్యులు ‘ఏ’ సర్టిఫికేట్ జారీచేశారు. సాధారణంగా మితిమీరిన శృంగారం లేదా హింస ఉన్న చిత్రాలకు ‘ఏ’ సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. సస్పెన్సు’ హారర్ చిత్రాలకు క్లీన్ యూ ఇవ్వకపోయినా కూడా ‘యూ/ ఏ’ ఇవ్వడం జరుగుతుంది. ఇటీవల తాప్సి నటించిన థ్రిల్లర్ “గేమ్ ఓవర్” చిత్రానికి ‘యూ/ ఏ’ సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. కానీ అమలా పాల్ ఆమె చిత్రానికి ‘ఏ’ సర్టిఫికేట్ ఇవ్వడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

అమలా పాల్ ఈ చిత్రంలో కొన్ని సన్నివేశాలలో న్యూడ్ గా నటించిన సంగతి తెలిసిందే, మరి అందుకు సెన్సార్ సభ్యులు ఏ సర్టిఫికేట్ ఇచ్చారా లేక ఆమె చిత్రంలో హింసా రక్తపాతం ఎక్కువగా ఉండటం వలన జారీచేశారా అనేది తెలియాల్సివుంది.

సంబంధిత సమాచారం :