మళ్ళిరావా సెన్సార్ వివరాలు !
Published on Nov 29, 2017 6:31 pm IST

సుమంత్ చేసిన సినిమాలు ఈ మద్య పెద్దగా సక్సెస్ కాలేదు. తాజాగా కొత్త టీంతో మళ్ళిరావా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. గౌతమ్ తిన్ననురి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం కానున్నారు. ఆకాంక్ష సింగ్ ఈ సినిమాతో హీరోయిన్ గా పరిచయం కానుంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పాటలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. రేపు ఈ సినిమా ట్రైలర్ విడుదల కానుంది.

సెన్సార్ పూర్తి చేసుకొన్న ఈ సినిమాకు క్లీన్ యు సట్టిఫికేట్ లభించింది. డిసెంబర్ 8 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాను రాహుల్ యాదవ్ నక్క నిర్మించారు. ఈ రొమాంటిక్ లవ్ స్టోరి కి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ప్రస్తుతం జరుగుతోంది. సుమంత్ కెరీర్‌లో ఇది బెస్ట్ మూవీ అవుతుందని చిత్ర యూనిట్ కాన్ఫిడెంట్ గా ఉంది.

 
Like us on Facebook