మధుర శ్రీధర్ సమర్పించిన ‘లేడీస్ & జంటిల్ మెన్’ చిత్రం నిన్న విడుదలై మంచి రివ్యూలను అందుకుంటుంది. సినిమాలో నటించిన అందరి నటీనటుల ప్రదర్శన ఒకెత్తయితే చైతన్య కృష్ణ నటన మరొకెత్తుగా అభివర్ణిస్తున్నారు.
అమాయకపు యువకుడిగా చైతన్య నటించిన తీరు అందరినీ ఆశ్చర్యపరిచింది. తన గత చిత్రాలలో సైతం పాత్ర పరిధిమేరకు 100శాతం న్యాయం చేసినా ఆశించిన పేరు, ఖ్యాతిలను గడించలేకపోయాడు. అయితే ఈ సినిమా అతని కెరీర్ కి మంచి బ్రేక్ ఇవ్వడం ఆనందకరం. ఇటువంటి మంచి పాత్రలు భవిష్యత్తులో మరిన్ని రావాలని కోరుకుందాం.


