చలపతిరావ్ కామెంట్స్ కి తాము నవ్వలేదంటున్న చైతన్య, రకుల్ !
Published on May 23, 2017 4:55 pm IST


‘రారండోయ్ వేడుక చూద్దాం’ ఆడియో వేడుకలో సీనియర్ నటుడు చలపతిరావ్ మహిళలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు పెద్ద రసాభాసగా మారాయి. ప్రస్తుతం తెలుగు పరిశ్రమలో ఎక్కడ చూసినా ఈ విషయంపైనే చర్చ జరుగుతోంది. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు ఈ వ్యాఖ్యలను ఖండించగా వేడుకలో ఉన్న నాగ చైతన్య, రకుల్ ప్రీత్ సింగ్ లు కూడా వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు.

ఈ వ్యాఖ్యలకు సంబందించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో చల్ చేస్తోంది. అందులో చలపతిరావ్ మాట్లాడగానే నాగ చైతన్య, రకుల్ ప్రీత్ సింగ్ లు వెంటనే బిగ్గరగా నవ్వినట్టు ఉంది. దాంతో అందరూ చలపతిరావ్ వ్యాఖ్యలను వారిద్దరూ జోక్ గా తీసుకున్నారని అనుకున్నారు. కానీ వీడియోలో చూపినట్టు తాము ఆయన మాటలకు నవ్వలేదని, అవి వేరే సందర్భంలో దృశ్యాలని అన్నారు. అలాగే ఆయన వ్యాఖ్యలను తాము తీవ్ర స్థాయిలో ఖండిస్తున్నామని తెలిపారు.

 
Like us on Facebook