చైతు ‘లవ్ స్టోరీ’కి మంచి డిమాండ్ ఉందట !

చైతు ‘లవ్ స్టోరీ’కి మంచి డిమాండ్ ఉందట !

Published on Apr 4, 2020 12:00 AM IST

సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో క్రేజీ కాంబినేషన్ నాగచైతన్య – నేచురల్ బ్యూటీ సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా ‘లవ్ స్టోరీ’ అనే సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ప్రేక్షకులు సైతం ఈ ప్రాజెక్ట్ తప్పకుండా చైతూ కెరీర్లో వసూళ్ళ పరంగా కొత్త ఫిగర్స్ నమోదుచేయవచ్చని అనుకుంటున్నారు. విడుదల తర్వాతి సంగతి ఎలా ఉన్నా విడుదలకు ముందే ఈ చిత్రం చైతూకు ఇక రికార్డ్ అందించింది. ఇండస్ట్రీ వర్గాల సమాచారం మేరకు ఈ సినిమా శాటిలైట్ రైట్స్ అండ్ ఓవర్సీస్ హక్కులు చైతూ గత సినిమాలన్నింటికంటే భారీ ధర పలుకుతున్నట్లు
తెలుస్తోంది. ఇందుకు కారణం సినిమా కాంబినేషన్. శేఖర్ కమ్ముల గత చిత్రం ‘ఫిదా’ భారీ బ్లాక్ బస్టర్ అయింది. ముఖ్యంగా ఓవర్సీస్ ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంది. దానికి తోడు సాయి పల్లవి ఇందులో హీరోయిన్. చైతూతో ఆమె నటించడం ఇదే ప్రథమం. అందుకే వీరి జోడీపై అంచనాలు పెరిగాయి.

ఇక బలమైన కథలతో సినిమాలు తీసే డైరెక్టర్ గా మంచి పేరు ఉన్న శేఖర్ కమ్ముల.. ఫిదా లాంటి సెన్సేషనల్ హిట్ తరువాత చేస్తోన్న సినిమా కావడంతో ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. డిస్ట్రిబ్యూటర్స్ గా ఇప్పటి వరకూ వందలాది సినిమాలను విడుదల చేసిన ఏసియన్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఈ సినిమాతో ఫస్ట్ టైమ్ నిర్మాణ రంగంలోకి దిగుతోంది. కాగా నారాయణదాస్ నారంగ్, ఎఫ్.డి.సి చైర్మైన్ రామ్మోహనరావు ఈ చిత్రానికి నిర్మాతలు. ఈ సినిమా పై మంచి అంచనాలు ఉన్నాయి. మరి ఆ అంచనాలను ఈ సినిమా అందుకుంటుందో లేదో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు