ఖరారైన గౌతం – చైతూల సినిమా హీరోయిన్

ఖరారైన గౌతం – చైతూల సినిమా హీరోయిన్

Published on May 14, 2015 4:37 PM IST

Naga-Chaitanyas-first-look
అక్కినేని యువ హీరో నాగచైతన్యకి కెరీర్ బెస్ట్ మూవీని అందించిన దర్శకుడిగా గౌతమ్ మీనన్ పేరు సంపాదించుకున్నాడు. ‘ఏం మాయచేశావే’ అంటూ చైతూ సమంతాలతో నిజంగానే మాయ చేసి పారేశాడు. మరోసారి వీరిద్దరి కాంబినేషన్ ల తెరకెక్కుతున్న సినిమాకు హీరోయిన్ ని ఖరారు చేసినట్టు తెలుస్తుంది.

ముందుగా సమంతాని అనుకున్నా ఇప్పుడు ఆమె స్థానంలో కేరళ బ్యూటీ మంజిమ మోహన్ ఎంపిక చేశారు గౌతమ్. తమిళంలో శింబు, తెలుగులో నాగ చైతన్య హీరోలుగా ఒకే కథతో ఏకకాలంలో రెండు సినిమాలకు ప్లాన్ చేశాడు గౌతమ్ మీనన్. రెండు భాషల్లోనూ హీరోయిన్ గా మంజిమ మోహన్ నటిస్తుంది.

బాలనటిగా కెరీర్ ప్రారంభించిన మంజిమ మోహన్.. ఇటీవల ‘ఓరు వడక్కన్ సెల్ఫీ’ అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. గౌతమ్ సినిమాలో ఛాన్స్ అందుకోవడమే కాక ఒకేసారి తెలుగు, తమిళ భాషల్లో పరిచయంకానుంది. మరి ఈ కొత్త ముద్దుగుమ్మ కూడా సమంతలా ప్రేక్షకులను మెప్పిస్తుందేమో చూడాలి…!

తాజా వార్తలు