రేపటి నుండి సందడి చేయనున్న నితిన్ !

17th, March 2018 - 04:28:20 PM

‘లై’ సినిమా తర్వాత నితిన్ చేసిన సినిమా ‘ఛల్ మోహన్ రంగ’. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ చిత్రం ఏప్రిల్ 5న విడుదలకానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుండి ‘గ ఘ మేఘ, ఫస్ట్ లుక్ సోమవారం, పెద్దపులి’ వంటి పాటలు విడుదలకాగా ఇప్పుడు పూర్తి పాటలు బయటకురానున్నాయి.

ఉగాది సందర్బంగా రేపు ఉదయం 9 గంటలకు అన్ని పాటలతో కూడిన జ్యూక్ బాక్స్ విడుదలకానుంది. ఇప్పటికే చరణ్ ‘రంగస్థలం’, కళ్యాణ్ రామ్ ‘ఎం.ఎల్.ఏ’ పాటలు ప్రేక్షకుల్ని అలరిస్తుండగా రేపటి నుండి నితిన్ సందడి మొదలుకానుంది. నితిన్ కు జోడీగా మేఘా ఆకాష్ నటించిన ఈ చిత్రాన్ని కృష్ణ చైతన్య డైరెక్ట్ చేయగా థమన్ సంగీతాన్ని అందించారు.