సీనియర్ నటుడు చలపతిరావుగారు మహిళలను ఉద్దేశించి చేసిన కామెంట్స్ పరిశ్రమలో పెద్ద దుమారాన్నే లేపాయి. దీనిపై స్పందించిన సినీ ప్రముఖులంతా చలపతిరావు మాటలని తీవ్ర స్థాయిలో ఖండించారు. పలు మహిళా సంఘాలు కూడా ఆయన్ను తీవ్రంగా వ్యతిరేకించాయి. దీంతో పొరపాటును గ్రహించిన చలపతిరావు వివరణ ఇచ్చే ప్రయత్నంతో పాటు రాత పూర్వకంగా క్షమాపణలు కూడా చెప్పారు.
క్షమాపణా లేఖలో ’73 ఏళ్ల వయసులో, 50 ఏళ్ల సినీ జీవితంలో అనాలోచితంగా నేను చేసిన వ్యాఖ్య దృదృష్టకరం. ఈ వ్యాఖ్యను పలు టీవీ చానళ్లు పదే పదే ప్రసారం చేసి నన్ను చరిత్రహీనుడిగా ,మార్చడం పట్ల బాధపడుతున్నాను. నిజమే ఆ వ్యాఖ్యల్ని చేయకుండా ఉండాల్సింది. ఇందుకుగాను ఎలాంటి షరతులు లేకుండా క్షమాపణ చెబుతున్నాను. కానీ టీవీల్లో, సినిమాల్లో, సామాజిక మాధ్యమాల్లో ఆడవాళ్లను కించపరిచే దృశ్యాలకు, మాటలకు మనమందరం భాద్యులమే’ అన్నారు.