ఇంటర్వ్యూ : చందూ మొండేటి – హలో బ్రదర్ కు సవ్యసాచికి ఎటువంటి పోలిక వుండదు !

ఇంటర్వ్యూ : చందూ మొండేటి – హలో బ్రదర్ కు సవ్యసాచికి ఎటువంటి పోలిక వుండదు !

Published on Oct 29, 2018 5:40 PM IST

‘ప్రేమమ్’ చిత్రం తరువాత యువ దర్శకుడు చందూ మొండేటి తెరకెక్కించిన చిత్రం ‘సవ్యసాచి’. ఈ చిత్రం నవంబర్ 2న విడుదలవుతున్న సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు ఆ విశేషాలు ఇప్పుడు మీకోసం…

ఈ చిత్రం తెరకెక్కించాలనే ఆలోచన ఎలా వచ్చింది ?

కొన్ని సంవత్సరాల క్రితం ఒక ఆర్టికల్ చదివాను ట్విన్ సిండ్రోమ్ మీద. నాకు చాలా ఇంట్రస్టింగ్ గా అనిపించింది. ఆ తరువాత చైతు తో అలాగే నిర్మాతలకు ఈ సబ్జెక్టు వాళ్ళకు వినిపించాను. ఆవెంటనే వాళ్ళు కూడా ఒకే చెప్పారు.

ఈచిత్ర ట్రైలర్ లో హలోబ్రదర్ ఛాయలు కనిపించాయి. సినిమాకూడా అలాగే వుంటుందా ?

లేదు. ఇది కంప్లీట్ గా కొత్త కాన్సెప్ట్. ఆ సినిమాను పోలిన కొన్ని కామెడీ సన్నివేశాలు ట్రైలర్లో ఉండడం వల్ల మీరు ఆలా ఫీల్ అయ్యారు అంతే కాని హలో బ్రదర్ కు ఈ చిత్రానికి అస్సలు పోలికే వుండదు.

చిత్రానికి ఆ టైటిల్ నే ఎందుకు పెట్టాలనుకున్నారు ?

స్క్రిప్ట్ దశలోనే ఈ చిత్రానికి సవ్యసాచి టైటిల్ అయితే బాగుంటుందని అనుకున్నాను. ఈ స్టొరీ కి ఆ టైటిల్ సరిగ్గా సరిపోతుందనిపించింది. సినిమాలో హీరో రెండు చేతులకు ఇంపార్టెన్స్ ఉంటుంది.

మాధవన్ గారిని ఈచిత్రానికి ఎలా ఒప్పించారు ?

మాధవన్ సర్ గొప్ప గొప్ప దర్శకులతో పని చేశారు. ఆయనకు ఈ స్క్రిప్ట్ చెప్పేటప్పుడు మొదట్లో కొంచెం ఇబ్బంది పడ్డాను. 45నిమిషాలు స్క్రిప్ట్ చెప్పాక మాధవన్ గారు ఇంప్రెస్ అయ్యి వెంటనే ఓకే చెప్పారు.

సూపర్ హిట్ సాంగ్ ‘నిన్ను రోడ్డు మీద’ అనే పాటను రీమిక్స్ చేయాలనీ ఎందుకు అనిపించింది ?

అది పూర్తి గా నా ఆలోచనే. ఎంటర్టైనింగ్ ఫస్ట్ హాఫ్ తరువాత సినిమా సెకండ్ హాఫ్ సీరియస్ నోట్ లో సాగుతుంది. ఆ సమయంలో ప్రేక్షకులు కూడా కొంచెం రిలాక్స్ కావాలని ఈ రీమిక్స్ ను ప్లాన్ చేశాం.

మీ తదుపరి చిత్రాల గురించి ?

ప్రస్తుతానికైతే సవ్యసాచి విడుదల కోసం ఎదురుచూస్తున్నాను. ఈసినిమా ప్రమోషన్స్ అయిపోయాక నెక్స్ట్ స్క్రిప్ట్ గురించి ఆలోచిస్తా.

చిత్రం విడుదలకు సమయం దగ్గర పడుతుండంతో ఏమైనా నర్వస్ గా ఫిల్ అవుతున్నారా ?

అవును కొంచెం అలాగే వుంది , కానీ ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా ఉంటుందో తెలుసుసుకోవాలని ఆతృతగా కూడా వుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు