
2015 మే 29న మలయాళంలో రిలీజ్ అయిన ‘ప్రేమమ్’ సినిమా ప్రేక్షకుల మన్ననలతో పాటు బాక్స్ ఆఫీసు దగ్గర కూడా కాసుల వర్షం కురిపించి మలయాళంలో సరికొత్త రికార్డులను క్రియేట్ చేసింది. ఈ సినిమాని తెలుగులో రీమేక్ చెయ్యాలని పలువురు ప్రయత్నాలు చేయగా ఫైనల్ ఛాన్స్ మాత్రం అక్కినేని ఫ్యామిలీ హన్డ్సం హీరో నాగ చైతన్యని వరించింది. ‘కార్తికేయ’ సినిమాతో సక్సెస్ఫుల్ డైరెక్టర్ గా పరిచయం అయిన చందూ మొండేటి ఈ సినిమాకి దర్శకత్వ బాధ్యతలు చేపట్టనున్నాడు. ఈ సినిమాలో మొత్తం ముగ్గురు హీరోయిన్స్ ఉంటారు.
ఇప్పటికే అందులో ఒకరుగా మలయాళ వెర్షన్ లో నటించిన అనుపమ పరమేశ్వరన్ ని ఎంపిక చేసారు. మిగిలిన హీరోయిన్స్ విషయంలో ఇప్పటికే పలువురు హీరోయిన్స్ పేర్లు వినిపిస్తున్నాయి. అందులో ఒక పేరే నిత్యా మీనన్. కానీ నిత్యా మీనన్ విషయంలో చందూ క్లారిటీ ఇచ్చాడు. ప్రేమమ్ రీమేక్ కోసం మేము ఎప్పుడూ నిత్యా మీనన్ ని అనుకోలేదు, అస్సలు అప్రోచ్ కూడా కాలేదు. నిత్యా మీనన్ ఈ సినిమా చేయడం లేదని తెలిపాడు. ప్రస్తుతం మిగిలిన ఇద్దరు హీరోయిన్స్ కోసం పలువురిని పరిశీలిస్తున్నాం. త్వరలోనే ఫైనల్ చేస్తామని చందూ తెలిపాడు. హారిక – హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై రాధాకృష్ణ ఈ సినిమాకి ‘మజ్ను’ అనే టైటిల్ ని పరిశీలిస్తున్నారు. నవంబర్ నుంచి ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్ళే పనిలో ఉన్నారు.

