గల్లీ రౌడీ నుండి “చాంగురే ఐటెం సాంగురే” పాటను విడుదల చేసిన రకుల్

Published on Jul 22, 2021 9:11 pm IST


జీ. నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వం లో సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం గల్లీ రౌడీ. ఈ చిత్రాన్ని ఎంవీవీ సత్యనారాయణ నిర్మిస్తున్నారు. అయితే కామెడీ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ చిత్రం పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ చిత్రం కి సంబంధించిన టీజర్ ను అర్జున్ రెడ్డి ఫేం విజయ్ దేవరకొండ విడుదల చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రం నుండి ఒక ఐటెం సాంగ్ విడుదల అయింది.

ప్రముఖ నటి రకుల్ ప్రీత్ సింగ్ ఈ చిత్రం లోని చాంగురే ఐటమ్ సాంగ్ రే లిరికల్ సాంగ్ ను విడుదల చేయడం జరిగింది. భాస్కరభట్ల ఈ పాటకి లిరిక్స్ రాయగా, మంగ్లి పాటను పాడటం జరిగింది. ఈ పాటకి ప్రేమ్ రక్షిత్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. ఈ బాబీ సింహ, నేహా శెట్టి, పోసాని కృష్ణమురళి, వైవా హర్ష, రాజేంద్ర ప్రసాద్, స్నేహ గుప్త తదితరులు కీలక పాత్రల్లో నటించారు. అయితే ఈ చాంగురే ఐటమ్ సాంగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :