మెస్సీ ఫ్యాన్స్ ఆగ్రహం: బాటిల్స్ విసిరి, కుర్చీలు విరగ్గొట్టి రచ్చ రచ్చ.. సారీ చెప్పిన సీఎం మమతా బెనర్జీ!!

మెస్సీ ఫ్యాన్స్ ఆగ్రహం: బాటిల్స్ విసిరి, కుర్చీలు విరగ్గొట్టి రచ్చ రచ్చ.. సారీ చెప్పిన సీఎం మమతా బెనర్జీ!!

Published on Dec 13, 2025 3:36 PM IST

Lionel Messi

ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీని ( Lionel Messi) ఒక్కసారైనా నేరుగా చూడాలని భారతీయ అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూశారు. కానీ, ఆ కోరిక కోల్‌కతాలోని సాల్ట్ లేక్ స్టేడియంలో తీరకపోగా, పెద్ద గొడవకు దారితీసింది. వేలాదిగా తరలివచ్చిన అభిమానులకు తీవ్ర నిరాశే మిగిలింది. అసలు ఏం జరిగిందంటే..

స్టేడియంలో ఏం జరిగింది?

శనివారం ఉదయం మెస్సీని (Lionel Messi) చూడడానికి సాల్ట్ లేక్ స్టేడియం పూర్తిగా నిండిపోయింది. టికెట్ల కోసం ఫ్యాన్స్ వేల రూపాయలు ఖర్చు చేశారు. కానీ, మెస్సీ గ్రౌండ్‌లోకి వచ్చినప్పుడు, అతన్ని చూసే అవకాశం స్టేడియంలోని వారికి దక్కలేదు. మెస్సీ చుట్టూ రాజకీయ నాయకులు, పోలీసులు, ఇతర ప్రముఖులు గుంపుగా చేరడంతో, గ్యాలరీలో ఉన్న సామాన్య జనానికి మెస్సీ కనీసం కనిపించలేదు.

కేవలం 20 నిమిషాల పాటు మాత్రమే మెస్సీ అక్కడ ఉన్నాడు. ప్లాన్ ప్రకారం మెస్సీ స్టేడియం మొత్తం ఒక రౌండ్ తిరగాల్సి ఉంది, కానీ ఈ గందరగోళం వల్ల అది సాధ్యపడలేదు.

Lionel Messi ఫ్యాన్స్ ఆగ్రహం – పోలీసుల యాక్షన్

తమ అభిమాన ఆటగాడిని సరిగ్గా చూడలేకపోవడంతో ఫ్యాన్స్ కోపం కట్టలు తెంచుకుంది. “చీటర్, చీటర్” (మోసం) అంటూ నినాదాలు చేశారు. స్టేడియంలోని ప్లాస్టిక్ కుర్చీలు విరగ్గొట్టి, వాటర్ బాటిల్స్‌ని గ్రౌండ్‌లోకి విసిరేశారు. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. కొన్ని చోట్ల లాఠీచార్జ్ కూడా జరిగిందని సమాచారం. ఈ గొడవల మధ్య మెస్సీని సేఫ్‌గా అక్కడి నుంచి బయటకు పంపించేశారు.

ఆర్గనైజర్ అరెస్ట్ – సీఎం క్షమాపణ

ఈవెంట్ ఫెయిల్ అవ్వడానికి ప్రధాన కారణం ‘మిస్ మేనేజ్మెంట్’అని తేలింది. దీంతో కోల్‌కతా పోలీసులు ఈవెంట్ మెయిన్ ఆర్గనైజర్ అయిన శతద్రు దత్తాను అదుపులోకి తీసుకున్నారు.

మరోవైపు, ఈ ఘటనపై వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ స్పందించారు. జరిగిన దానికి తాను ఎంతో బాధపడుతున్నానని, నిర్వాహకుల వైఫల్యం వల్లే ఇలా జరిగిందని అన్నారు. మెస్సీకి, అలాగే స్టేడియానికి వచ్చిన ఫ్యాన్స్ అందరికీ ఆమె బహిరంగంగా సారీ (Apology) చెప్పారు.

షారుఖ్ ఖాన్‌తో మీటింగ్

స్టేడియం ప్రోగ్రామ్ రసాభాస అయినప్పటికీ, అంతకుముందు హోటల్‌లో మెస్సీని బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ కలిశారు. కానీ స్టేడియంలో జరగాల్సిన మరికొన్ని కార్యక్రమాలు మాత్రం రద్దయ్యాయి. కోల్‌కతా టూర్ ముగించుకుని మెస్సీ ఇప్పుడు తన తదుపరి ప్రోగ్రామ్ కోసం హైదరాబాద్ బయలుదేరారు.

Click here for Video

తాజా వార్తలు