క్యారెక్ట‌ర్ ఇంట్రో లుక్ తో ‘మంచి రోజులు వచ్చాయి’ !

Published on Jul 24, 2021 7:52 pm IST

యువీ కాన్సెప్ట్స్, మాస్ మూవీ మేకర్స్ సంయుక్తంగా వరస విజయాలతో దూసుకుపోతున్న దర్శకుడు మారుతి రూపొందిస్తున్న కొత్త సినిమా మంచి రోజులు వచ్చాయి. ఏక్ మినీ కథ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న యువ హీరో సంతోష్ శోభన్ ఈ చిత్రంలో మెయిన్ లీడ్ చేస్తున్నారు. మహానుభావుడు లాంటి సూపర్ హిట్ సినిమా తర్వాత మారుతి కాంబినేషన్‌లో మెహ్రీన్ కౌర్ ఫిర్జాదా హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమాను వి సెల్యులాయిడ్, SKN నిర్మిస్తున్నారు. టాక్సీవాలా తర్వాత ఈయన నిర్మాణంలో వస్తున్న సినిమా ఇది. మారుతి, యూవీ సంస్ధ‌, SKN అంటే సూపర్ హిట్ కాంబినేషన్. ఈ కాంబోలో ఇప్పుడు మంచి రోజులు వచ్చాయి సినిమా రాబోతుంది. ఏక్ మినీ కథ లాంటి హిట్ సినిమాను నిర్మించిన యూవీ కాన్సెప్ట్స్ తో మరోసారి జోడీ కట్టాడు సంతోష్ శోభన్. ఇటీవ‌లే ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదలైంది.

దీనికి అద్భుతమైన స్పందన ల‌భించింది, ఈ నేప‌థ్యంలోనే విడుద‌లైన క్యారెక్ట‌ర్ ఇంట్రో లుక్ వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది, అన్ని వర్గాల ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకుంటుంది. సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. మిగిలిన వివరాలు దర్శక నిర్మాతలు త్వరలోనే తెలియజేయనున్నారు.

నటీనటులు: సంతోష్ శోభన్, మెహ్రీన్ కౌర్ ఫిర్జాదా. టెక్నికల్ టీం:
కథ, స్క్రీన్ ప్లే, దర్శకుడు: మారుతి
నిర్మాత: వి సెల్యూలాయిడ్, SKN
బ్యానర్స్: యువీ కాన్సెప్ట్స్, మాస్ మూవీ మేకర్స్ సినిమాటోగ్రఫీ: సాయి శ్రీరామ్
సంగీతం: అనూప్ రూబెన్స్
పిఆర్ఓ: ఏలూరు శ్రీను, మేఘ శ్యామ్

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :