చరణ్ భారీ ప్రాజెక్ట్ అప్పుడు మొదలు కానుందా.?

Published on Mar 18, 2021 1:00 pm IST

ఇప్పుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ దర్శక ధీరుడు రాజమౌళితో రౌద్రం రణం రుధిరం అనే భారీ పాన్ ఇండియన్ మల్టీ స్టారర్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. మరి ఈ చిత్రం ఇంకా లైన్ లో ఉండగానే మరో ఇండియన్ సెన్సేషనల్ దర్శకుడు శంకర్ తో మరో భారీ పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ ను అనౌన్స్ చెయ్యడంతోనే వేరే లెవెల్ హైప్ ను ఈ కాంబో సెట్ చేసుకుంది. ఇప్పటికే పలు ఆసక్తికర గాసిప్స్ వినిపిస్తున్న ఈ చిత్రంపై మరో ఇంట్రెస్టింగ్ బజ్ వినిపిస్తుంది.

మరి దాని ప్రకారం ఈ భారీ చిత్రం ఎప్పుడు మొదలు కానుందో తెలుస్తుంది. ఈ సినిమాను శంకర్ ఈ వచ్చే జూన్ నుంచి మొదలు పెట్టే అవకాశం ఉందని టాక్ వినిపిస్తుంది. మరి ఇందులో ఎంత వరకు నిజముందో కానీ ప్రస్తుతానికి ఈ టాక్ మొదలయ్యింది. అలాగే ఈ భారీ సినిమాకు గాను సంగీత దర్శకుడుగా ఏ ఆర్ రెహమాన్ ఫిక్స్ అయ్యారని తెలిసిందే. ఫైనల్ గా ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ను దిల్ రాజు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :